పాట్నా : పెళ్లి వేడుకల్లో, ఇతర ఉత్సవాల్లో ఆకతాయిలు తమ ఇష్టం వచ్చినట్టు గాల్లోకి కాల్పులు జరపడం ఫ్యాషన్‌గా మారిపోయింది. కానీ బిహార్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫేర్‌వెల్ పార్టీలో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిహార్‌లోని కతిహార్‌లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సిదార్థ్ మోహన్ జైన్‌కు ఇటీవలే సీబీఐ అధికారిగా ప్రమోషన్ లభించింది.
తాను ఎప్పటినుంచో కోరుకున్న పదవి లభించడంతో ఆనందంలో ఉన్న జైన్ తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న మరో అధికారి మితిలేశ్ మిశ్రా ఓ హిందీ పాట పాడుతుండగా.. జైన్ ఆ పాటకి తగ్గ స్టెప్పులు వేస్తూ.. అదే తీరుగా తుపాకితో గాల్లోకి తొమ్మిది సార్లు కాల్పులు జరిపాడు. అదృష్టావశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరుగలేదు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఆయుధాన్న దుర్వినియోగం చేసినందుకు అతనిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment