
మా టీచర్‌ను పదోన్నతిపై పంపొద్దు
నల్లగొండ : నారాయణపురం మండంలోని పుట్టపాక జిల్లా పరిషత్ పాఠశాల తెలుగు టీచర్‌ను హైదరాబాద్‌లోని ఏసీఈఆర్‌టీకీ పదోన్నతిపై పంపించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు.
తెలుగు ఉపాధ్యాయుడి పదోన్నతిని నిలిపేయాలని ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు. అదే విధంగా నల్లగొండలో సర్పంచ్ ఎన్.కళమ్మ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సామల విజయలక్ష్మి, అమరేందర్, లింగస్వామి, రాజు, భాస్కర్ పాల్గొన్నారు.