telugu teacher
-
వినూత్న రీతిలో విద్యార్థులకు విద్యాబోధన
-
తెలుగు టీచర్‌కు ‘తెగులు’.. విద్యార్థినులతో తరగతి గదిలోనే వికృత చేష్టలు
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తన చేష్టల ద్వారా వికృతరూపాన్ని బయటపెట్టాడు. ఆయన చేష్టలు శ్రుతిమించడంతో విద్యార్థినులు తమ ఇళ్లల్లో చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. కామోపాధ్యాయుడి బడితపూజ చేయాలనుకున్న చర్యలను ఉపాధ్యాయులు నిలువరించారు. బాధితుల తల్లిదండ్రుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నింబగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తొమ్మిది మంది టీచర్లు పనిచేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ వెంకటేశులు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు తెలుగు సబ్జెక్టు బోధిస్తున్నారు. ఈయన ఇటీవల కాలంలో పాఠాలను పక్కనపెట్టి అమ్మాయిలపై ‘ఫోకస్’ పెట్టాడు. ఓనీ తీసి డ్యాన్స్ చేయాలని, తనకు ముద్దులు పెట్టాలని అమ్మాయిలను ఒత్తిడి చేసేవాడు. ద్వందార్థాలు, వెకిలి చేష్టలు వికృతరూపం దాల్చాయి. టార్చర్ తట్టుకోలేక కొంతమంది విద్యార్థినులు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఆగిపోతున్నారు. చదవండి: (ఏ పోలీసోడు వస్తాడో.. రమ్మనండి!) ఇందుకు గల కారణాలను పలువురు తల్లిదండ్రులు తెలుసుకుని 15 రోజుల క్రితం టీచర్ వెంకటేశులుపై ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు పోలీసులు సదరు టీచర్‌ను స్టేషన్‌కు పిలిపించారు. తాను సరిగా చదవకపోతే కొట్టాను తప్ప, అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పడంతో.. మరోసారి ఇలా జరగకుండా బుద్ధిగా ఉండాలని వెంకటేశులుకు చెప్పి పంపించేశారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. తన పంథా మార్చుకోలేదు. మళ్లీ అమ్మాయిలను వేధించడం కొనసాగించాడు. తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని తల్లిదండ్రులు రగిలిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల వద్దకెళ్లి ఆందోళనకు దిగారు. తెలుగు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటాడా అంటూ ఆగ్రహంతో టీచర్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. పరిస్థితిని పసిగట్టిన హెచ్ఎం విజయలక్ష్మి సదరు టీచర్ వెంకటేశులును ఓ గదిలో పెట్టి తాళం వేసి.. పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి తెలిపారు. -
తరగతిలో ఫ్యాన్‌కు టీచర్ మృతదేహం
సాక్షి, చెన్నై: ప్రైవేటు కళాశాల తరగతి గదిలో తెలుగు టీచర్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బుధవారం కలకలం రేపింది. ఆమె చేతి మణికట్టు భాగంలో కత్తి గాటు ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలుకా ఎల్లయమ్మన్ ఆలయం వీధికి చెందిన హరి శాంతి(32) మద్రాసు వర్సిటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. పేద తెలుగు కుటుంబం నుంచి చెన్నైకు వచ్చిన ఆమె స్థానికంగా ఖాళీ సమయాల్లో చిన్నాచితక పనులు కూడా చేసుకుంటూ చదువును కొనసాగించారు. అలాగే పూందమల్లి హైరోడ్డులోని డీజీ వైష్ణవ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంత కాలం పని చేశారు. ప్రస్తుతం పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం డీజీ వైష్ణవ కళాశాల తెలుగు విభాగం తరగతి గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడం చర్చనీయాంశం అయింది. అనుమానాస్పదం.. డీజీ వైష్ణవ కళాశాల నుంచి ఐదేళ్ల క్రితం ఆమె బయటకు వచ్చేశారు. అయినా తరచూ ఆ కళాశాలకు వెళ్తూ రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి సుపరిచితురాలిగా మారారు. మంగళవారం కళాశాలకు వెళ్లిన హరిశాంతి తిరిగి బయటకు రాలేదు. బుధవారం ఉదయం కళాశాల మొదటి అంతస్తులోని తెలుగు విభాగం తరగతి గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించడంతో పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. అరుంబాక్కం పోలీసులకు తెలపడంతో పులియాంతోపు డిప్యూటీ కమిషనర్ రాజేష్ ఖన్నా, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు, అరుంబాక్కం ఇన్స్పెక్టర్ శంకర్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించగా ఆమె ఎడమ చేతి మణికట్టుకు కత్తి, బ్లేడుతో కోసినట్టుగా గాటు కనిపించింది. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికంగా ఉన్న తెలుగు వారు విచారం వ్యక్తం చేశారు. మద్రాసు వర్సిటీలో చదువుకుంటున్న సమయంలో, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, టీచర్‌గా చేస్తున్న కాలంలో అనేక వేదికలపై హరి శాంతి కనిపించే వారు కావడంతో ఎక్కువ మంది తెలుగు వారికి ఆమె సుపరిచితురాలు. అదే సమయంలో ఆత్మహత్య చేసుకునేంత పిరికిది హరి శాంతి కాదని పలువురు సన్నిహితులు పేర్కొంటున్నారు. నటరాజ్‌తో పరిచయంపై ఆరా..... డీజీ వైష్ణవ కళాశాల నుంచి బయటకు వచ్చి టీచర్‌గా పనిచేస్తున్నా, తాను గతంలో పనిచేసిన కళాశాలకు పదే పదే హరిశాంతి వచ్చి వెళ్తుండడం ఆలోచించ దగ్గ విషయం. ఇక్కడ పనిచేస్తున్న నటరాజ్ అనే ప్రొఫెసర్‌తో ఆమెకు ఉన్న పరిచయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం కూడా ఆమె నటరాజ్‌ను కలవడానికే వచ్చినా, తిరిగి వెళ్లక పోవడం అనుమానాలకు దారి తీస్తున్నాయి. లోనికి వచ్చిన వ్యక్తి బయటకు వెళ్లారా..? లేదా అని తెలుసుకోని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుండడంతో పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరగతి గది సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మరణ సమాచారాన్ని అందుకున్న కుటుంబీకులు చెన్నైకు చేరుకుని కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. -
కొత్త టీచర్లు వస్తున్నారు..
తెలుగు మీడియంలో ఎస్జీటీలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఖాళీల ప్రకారం ఎంపికైన వారికి పోస్టింగ్ ఉత్తర్వులు అందజేయనున్నారు. – విద్యారణ్యపురి సాక్షి, వరంగల్ : టీఆర్టీ – 2017 ద్వారా చేపట్టిన నియామకాలకు సంబంధించిన ఎస్జీటీ ఫలితాలను కొన్ని నెలల క్రితమే వెల్లడించినా పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. ఎట్టకేలకు తెలుగు మీడియంలో ఎస్జీటీలుగా ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తాజాగా కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కాగా ఈ నెల నేడు అభ్యర్థుల జాబితాను వెల్లడించి కౌన్సెలింగ్ జరిగే ప్రదేశాన్ని కూడా ప్రకటిస్తారు. జిల్లా విద్యాశాఖాధికారి సంబంధిత ఖాళీలను గుర్తించనుండగా.. ఈ నెల 24న(రేపు) ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖాళీల జాబితా ప్రదర్శిస్తారు. ఈ నెల 25, 26వ తేదీల్లో టీచర్ రిక్రూట్మెంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఈఓ పర్యవేక్షణలో పరిశీలిస్తారు. ఈనెల 28, 29వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందజేయనుండగా.. 30న వారు పాఠశాలల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఇక నవంబర్ 2వ తేదీ వరకు ఎవరైనా కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక ఉత్తర్వులు పంపిస్తారు. 46 పోస్టుల భర్తీ టీఆర్టీ 2017లో నోటిఫికేషన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 82 ఎస్జీటీ పోస్టులు కేటాయించారు. వాటిలో ఏజెన్సీ ప్రాంతంలోని తెలుగు మీడియంలో 36 పోస్టులు, మైదాన ప్రాంతంలో 10 పోస్టులు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. నేడు వెల్లడించే అభ్యర్థుల జాబితా ప్రకారం ఎంత మందిని ఎంపిక చేశారనేది తెలుస్తుంది. ఇంగ్లిష్ మీడియం ఏజెన్సీ ప్రాంతంలో 26, మైదాన ప్రాంతంలో 10 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా పలు కారణాలతో వారికి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వడం లేదు. దీంతో వారి ఎంపిక జాబితాను వెల్లడించడం లేదు. 632 ఖాళీలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 632 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో నుంచే ఈ కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ పాఠశాలల్లోని ఎస్జీటీ ఖాళీలను చూపనున్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు చూపుతారనేది కౌన్సెలింగ్ సందర్భంగా వెల్ల్లడికానుంది. -
లోకేశ్ టీచర్‌కు భారీ నజరానా!
-
లోకేశ్ టీచర్‌కు జీతం ఎంతో తెలుసా?
సాక్షి, అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు తెలుగులో ఎలా మాట్లాడాలో తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు పాఠాలు నేర్పుతున్న పెద్ది రామారావుకు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చింది. లోకేశ్ ప్రసంగాలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మార్పులు సూచించే ఆయనను గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా మండలి సభ్యుడిగా నియమించింది. ఆయనకు నెలకు రూ. లక్ష వేతనం, హెచ్ఆర్ఏ కింద రూ.35 వేలు, అలాగే ప్రభుత్వ సలహాదారుతో సమానంగా ఇతర అలవెన్సులన్నీ వర్తింపజేయాలంటూ బుధవారం ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు ఒక ప్రైవేట్ కార్యదర్శిని, ఒక ప్రైవేట్ అసిస్టెంట్‌ను, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్‌ను కూడా ఇవ్వనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. గురువు నేపథ్యం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫైన్ ఆర్ట్స్ లో పీహెచ్డీ చేసిన పెద్ది రామారావు తెలుగు నాటక రచయితగా గుర్తింపు పొందారు. బుల్లితెరలో ప్రసారమైన రుతురాగాలు సీరియల్‌కు ఆయన మాటలు రాశారు. తర్వాత థియేటర్ ఆర్ట్స్‌కి సంబంధించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. మరీ ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే శిక్షకుడిగా వ్యవహరించారు. నటుడు రాజీవ్ కనకాలకు రామారావు బావ అవుతారు. కొన్నేళ్లుగా రామారావు, లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటూ.. తెలుగు ప్రసంగాలకు సంబంధించిన సలహాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ది రామారావును తెలుగు శిక్షకుడిగా లోకేశ్ నియమించుకున్నారు. -
తెగులు గురువు!
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా నిలవాల్సిన గురువు అందుకు విరుద్ధంగాప్రవర్తించారు. తెలుగు పాఠాలు చెప్పాల్సిన ఆయన తరగతి గదిలో ప్రేమ పాఠాలు చెప్పడం ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చారు. ఆయన ప్రవర్తనతో ఇబ్బందులు పడిన బాలికలు ఇన్నాళ్లూ సహనం వహించారు. అయితే ఆయనలో మార్పులేదు సరికదా వెకిలి చేష్టలు మరింత ఎక్కువయ్యాయి.దీంతో విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారంతాపాఠశాలను ముట్టడించారు. ఈ సంఘటన కంచిలి మండలం జలంత్రకోట జిల్లా పరిషత్ (ఒడియా) ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘోరంపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు ఉపాధ్యాయుడు ఇ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కంచిలి: జలంత్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇ.ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన కొన్నాళ్లుగా ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థినులు బయటకు చెప్పుకోలేకపోవడంతో దీన్ని అలుసుగా తీసుకున్న ఉపాధ్యాయుడు మరింత రెచ్చిపోయారు. తరగతి గదిలో పాఠాలకు బదులు ప్రేమ పాఠాలు చెబుతూ, చేయకూడని పనులు చేస్తూ అనుచితంగా ప్రవర్తించేవారని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని శుక్రవారం పాఠశాలకు వెళ్లిన మీడియా ఎదుట కన్నీరుమున్నీరై వివరించారు. పాఠాలు బోధించాల్సిన గురువే ఇంతటి దారుణంగా ప్రవర్తిస్తే తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఆయన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మందలించినా తీరుమారలే..: ఉపాధ్యాయుడు ప్రసాద్ వ్యవహార శైలిపై కొంతమంది విద్యార్థినులు ఇప్పటికే ప్రధానోపాధ్యాయడు జె.బాలకృష్ణ దృష్టికి తెచ్చి ఉన్నారు. దీంతో ఉపాధ్యాయుడ్ని పిలిపించి ఇప్పటికే మందలించారు. అయినా ఆయనలో మార్పురాలేదు. దీంతో విద్యార్థినులంతా ఉపాధ్యాయుడు తీరుపై తల్లిదండ్రులకు చెప్పడంతో రెండు రోజులుగా కొంతమంది వచ్చి ఆందోళన చేస్తున్నారు. శుక్రవారానికి తల్లిదండ్రుల ఆందోళన తీవ్రమైంది. ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులంతా పట్టుబట్టారు. మిగిలిన ఉపాధ్యాయులు కూడా గ్రామస్తులతో కలిసి తెలుగు ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో దిగివచ్చిన ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నారు. క్షమాపణ కోరుతూ లేఖరాశారు. అయితే గ్రామస్తులు మాత్రం శాంతించలేదు. ఉపాధ్యాయుడ్ని కఠినంగా శిక్షిం చాల్సిందేనని పట్టుబట్టారు. విషయం విద్యాశాఖాధికారుల దృష్టికి వెళ్లింది. డిప్యుటీ ఈవో టి.జోగారావు, ఎంఈవో ఎస్. శివరాంప్రసాద్‌లు శుక్రవారం పాఠశాలకు వచ్చి సంఘటనపై ఆరాతీశారు. ఉపాధ్యాయుడ్ని విచారించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జె.బాలకృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. ఉపాధ్యాయుడు సస్పెన్షన్: అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు ఇ.ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో సాయిరాం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ధ్రువీకరించారు. -
మా టీచర్‌ను పదోన్నతిపై పంపొద్దు
నల్లగొండ : నారాయణపురం మండంలోని పుట్టపాక జిల్లా పరిషత్ పాఠశాల తెలుగు టీచర్‌ను హైదరాబాద్‌లోని ఏసీఈఆర్టీకీ పదోన్నతిపై పంపించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. తెలుగు ఉపాధ్యాయుడి పదోన్నతిని నిలిపేయాలని ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు. అదే విధంగా నల్లగొండలో సర్పంచ్ ఎన్.కళమ్మ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సామల విజయలక్ష్మి, అమరేందర్, లింగస్వామి, రాజు, భాస్కర్ పాల్గొన్నారు. -
పసివాడిపై గురువు కాఠిన్యం
హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు పసివాడిపై కాఠిన్యం ప్రదర్శించాడు. సరిగ్గా చదవడం లేదనే సాకుతో విద్యార్థిని చితకబాదాడు. ఎల్బీనగర్ హస్తినాపూర్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలొ బాలాజీ దేవాదత్ అనే విద్యార్థిని తెలుగు టీచర్ చావగొట్టాడు. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అతడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని విచక్షణారహితంగా కొట్టిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. -
ప్రాణం తీసిన టీచర్ వేధింపులు
రామవరప్పాడు : ఓ టీచర్ వేధింపులతో పన్నెండేళ్లకే ఆ పాపకు నూరేళ్లు నిండిపోయాయి. టీచర్ మందలించిందన్న కారణంతో ఆ విద్యార్థిని పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం రామవరప్పాడులో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని అన్నపూర్ణదేవి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాలం రామారావు, లక్ష్మీ దంపతులు తమ ముగ్గురు కుమారైలతో రామవరప్పాడులోని గొళి కృష్ణయ్య వీధిలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె ప్రవల్లిక టీటీసీ చేస్తుండగా, రెండవ కుమార్తె ప్రియాంక ఇంటర్ చదువుతోంది. చిన్న కూతురైన నాగసత్యభార్గవి రామవరప్పాడులోని ఓ ప్రయివేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా తమ చిన్నారి కుమార్తె అకాల మృతితో రామారావు దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. అసలేం జరిగింది.. ఎప్పటి లాగానే భార్గవి ఉదయం పాఠశాలకు వెళ్లింది. క్వార్టర్లీ తెలుగు పరీక్ష రాస్తూ మధ్యలో బాత్రూంకు వె ళ్లాలంటూ టీచర్‌ను అడిగింది. టీచర్ అంగీకరించడంతో భవనం కింద ఉన్న మరుగుదొడ్లకు వెళ్ల్లకుండా సరాసరి భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కుడి వైపుగా కిందకు దూకేసింది. జరిగిన హఠాత్ పరిణామానికి ఏమి జరిగిందో అర్థం కాక పాఠశాలలోని సిబ్బంది కిందకు వచ్చి చూశారు. రక్తం మడుగులో పడి ఉన్న భార్గవిని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేలోపే మరణించింది. టీచర్ వేధింపులే కారణం.... పాఠశాలలోని తెలుగు టీచర్ వేధింపులే తమ బిడ్డను ఆత్మహత్యకు పురిగొల్పాయని భార్గవి తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల పాఠ్యాంశంలో ఏదో సందేహం అడగడంతో తెలుగు టీచర్ కోప్పడిందని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైందని తెలిపారు. అకారణంగా టీచర్ తిట్టడంతో భార్గవి తమకు చెప్పి బాధపడిందని వీరు తెలిపారు. పైగా అంతటితో ఆగకుండా తోటి విద్యార్థులు భార్గవితో మాట్లాడవద్దని టీచర్ హుకుం జారీ చేసిందని... దీంతో విద్యార్థులు భార్గవితో మాట్లాడటం మానేశారని చెప్పారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో చదవను తనను వేరే పాఠశాలలో చేర్పించండని పదే పదే భార్గవి తమను అడిగేదని తెలిపారు. వచ్చే సంవత్సరం తనకు నచ్చిన పాఠశాలలో చేర్పిస్తామని, అప్పటి వరకూ ఈ పాఠశాలలోనే చదువుకోవాలంటూ నచ్చ చెప్పడంతో ఇష్టం లేకపోయినా పాఠశాలకు వెళ్తుందని తెలుపుతూ కన్నీరు మున్నీరయ్యారు. బాత్రూంలో జారి పడిందని చెప్పారు -తండ్రి యాలం రామారావు ఇంత జరిగినా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించిందని తండ్రి రామారావు ఆరోపించారు. సాయంత్రం 3.30 గంటల సమయంలో పాఠశాల నుంచి మీ కుమార్తె కాలు జారి బాత్ రూంలో పడడంతో ఆయుష్ ఆస్పత్రికి తీసుకెళ్లామని ఫోన్ చేసి చెప్పారన్నారు. తీరా ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యంలో...మీ పాప భవనంపై నుంచి పడిందని మరళా ఫోన్ చేసి చెప్పారని చెప్పారు. భార్గవి చిన్నతనం నుంచి అన్ని తరగతుల్లో ఫస్టు ఉండేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన ... పాఠశాల నిర్లక్ష్యంతోనే విద్యార్థి నిండు ప్రాణాలు పోయాయని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. భార్గవి మృతదేహంతో ఉన్న అంబులెన్స్‌ను కదలనివ్వకుండా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వెలుగమ్మాయి
‘నాకు జీవితమంటే ఒక్క క్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తి కాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి లాంటిది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక’ అంటాడు జార్జి బెర్నార్డ్‌షా. మారిషస్‌లో పుట్టిన 'ఊర్మిళాదేవి' దీ అదే లక్ష్యం. 180 ఏళ్ల క్రితం... ఊర్మిళాదేవి పూర్వీకులు మారిషస్‌లో స్థిరపడ్డారు. అక్కడి సంస్కృతిలోనే మమేకమైపోయారు. ఆ కుటుంబంలోనే పాతిక సంవత్సరాల క్రితం ఊర్మిళాదేవి పుట్టింది. తెలుగు నేలతో ముడిపడిన తన మూలాలను తెలుసుకుంది. తెలుగు నుడికారంపై మమకారం పెంచుకుంది. తెలుగు నేలపై వాలిపోయింది. తెలుగమ్మాయి అనిపించుకుంది. ఆ రోజు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఫ్రెషర్స్‌డే ఉత్సాహంగా సాగుతోంది. విద్యార్థులంతా వారు తెలుగు ఎం.ఏ లో ఎందుకు చేరారో చెబుతున్నారు. అంతలో ఓ అమ్మాయి, ‘అందరికీ నమస్కారమండీ. తెలుగు భాషలో మంచి పట్టు సాధించేందుకే ఎం.ఏ తెలుగులో చేరాను. నా దేశంలో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాను. తెలుగుదేశాన్ని త్రిలింగ దేశమంటారని పుస్తకాల్లో చదివి, త్రిలింగ క్షేత్రాల్ని దర్శించాలని ఉవ్విళ్లూరాను...’ అంటూ, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య శ్రీదేవిలా ముద్దుగా పలికింది. ఆ మాటలకు అంతా కరతాళ ధ్వనులు చేశారు. అరవయ్యేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం చరిత్రలో అదో అరుదైన ఘట్టంగా చెప్పుకున్నారు. మారిషస్ నుంచి తెలుగు చదువుకునేందుకు ఓ అమ్మాయి రావడం అపూర్వంగా భావించారు. అమ్మ ప్రోత్సాహంతోనే... ఊర్మిళ పూర్వీకుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం. 1835లో బతుకు తెరువు కోసం మారిషస్ వలస వెళ్లిపోయారు. ఆ కుటుంబంలోని ప్రస్తుత తరానికి చెందిన దంపతులు నవీంద్, లక్ష్మి. వారి కవల కుమార్తెలు ఊర్మిళాదేవి, ఉష. ఊర్మిళ తల్లి తెలుగు ఉపాధ్యాయిని. తండ్రి ఆంగ్లం, సైన్స్, ఫ్రెంచ్ బోధించేవారు. ఆ కుటుంబ సభ్యులు తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోవడం, ఊర్మిళ తల్లిని బాధించేది. తెలుగులో పట్టా సాధించాలని ఆసక్తి ఉన్నా అప్పట్లో కళాశాలలు లేక చదవలేక పోయారు. మారిషస్ ఆంధ్ర మహాసభ నిర్వహించిన తెలుగు ప్రవేశిక, ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. తెలుగు భాష విశిష్టత గురించి తల్లి తరచూ చెబుతుండటంతో ఊర్మిళకు ఆసక్తి పెరిగింది. అప్పటికే బి.ఎస్సి. పూర్తి చేసిన ఆమె బి.ఏ (తెలుగు) కూడా చదవాలని నిర్ణయించుకుంది. బ్యాంకు ఉద్యోగం వద్దు... తెలుగు చదువే ముద్దు... బ్యాంకు ఉద్యోగం సంపాదించిన ఊర్మిళ, సాయంత్రం కళాశాలలో బిఏ (తెలుగు) చదవాలని నిర్ణయించుకుంది. ‘‘కళాశాలకు కాస్త ముందుగా వెళ్లేందుకు అనుమతివ్వమని బ్యాంకు యాజమాన్యాన్ని ప్రాధేయపడ్డాను. వారు అంగీకరించలేదు. దాంతో చదువు కోసం ఉద్యోగాన్నే వదిలేశాను’’ అంటారు ఊర్మిళ. భారతీయ భాషలను ప్రోత్సహించడం కోసం మారిషస్ ప్రభుత్వం తెలుగు పాఠశాలలను కూడా స్థాపించింది. మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న తెలుగు (బి.ఏ) కోర్సులో చేరింది. అక్కడ తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సౌదామిని మూర్తి గారి శిష్యరికంలో తెలుగు పరిజ్ఞానం పెంచుకున్నారు ఊర్మిళ. ‘‘ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర రచనలు చదివాను. విశ్వనాథ సత్యనారాయణ నాకు ఇష్టమైన కవి. ఆత్రేయ రాసిన ‘కప్పలు’ నాటకం స్ఫూర్తితో ‘మానవ స్వభావం, ‘ధన ప్రభావం’ అనే నాటకాలను రాసి ప్రదర్శించాను. ఈ రెండింటికీ పన్నెండు అవార్డులు లభించాయి. దాంతో మారిషస్ ఆంధ్ర మహాసభ ఉప కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు’’ అని ఊర్మిళ చెప్పారు. చదువుకున్న చోటే ఉపాధ్యాయినిగా... తాను చదువుకున్న మహాత్మాగాంధీ పాఠశాలలోనే తెలుగు ఉపాధ్యాయినిగా ఆమె చేరారు. ఇంతలో తెలుగు ఎం.ఏ. సీటు దొరికింది. స్టడీ లీవు తీసుకుని, విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్నారు. ‘‘నన్ను తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ మోహనరావు పరిచయం చేయగానే అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో బిడియంగా ఉండేదాన్ని. అక్కడి స్నేహితులు నన్ను అక్కున చేర్చుకున్నారు. తక్కువ కాలంలోనే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా ఎంతసేపైనా తెలుగు మాట్లాడగలుగుతు న్నాను’’ అంటారు ఊర్మిళ. ఆమెకు కర్ణాటక సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఎం.ఏ. తెలుగు చదువుతుండగానే గాత్ర సంగీతంలో సర్టిఫికెట్ కోర్సులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యారు. తెలుగమ్మాయికి ఆత్మీయ వీడ్కోలు రెండేళ్లలో చదువు పూర్తయింది. పరీక్షలైపోగానే మారిషస్ బయలుదేరారు ఊర్మిళ. ఆమెను మిత్రులంతా ఘనంగా సన్మానించారు. ఆడపిల్లను పుట్టింటికి సాగనంపినట్టు చీర, జాకెట్టు, పూలు, పండ్లు అందజేశారు. ‘‘ఏయూ తెలుగు విభాగం చరిత్రలో ఎంఏ తెలుగు చదివేందుకు ఓ విదేశీ విద్యార్థి రావడం ఇదే ప్రథమం. ఊర్మిళ తెలుగు భాషను ఎంతో నిజాయితీగా అభ్యసించింది. ఆమె స్వచ్ఛమైన తెలుగులో సంభాషిస్తుంటే ముచ్చటేసేది. ఆమె పదహారణాల అచ్చ తెలుగు ఆడపిల్ల’’ అని ప్రశంసించారు ప్రొఫెసర్ మోహనరావు. తెలుగంటే ఎందుకింత మక్కువని ఊర్మిళను ప్రశ్నిస్తే... ‘‘అమ్మంటే ఎందుకిష్టం అంటే ఏం చెబుతాం? తెలుగులో పీహెచ్డీ చేస్తాను. మారిషస్‌లో తెలుగు భాష వికాసానికి కృషి చేస్తాను. తెలుగు అధ్యాపకురాలిగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాను’’ అంటారు ఊర్మిళ. ఆమె.. తెలుగమ్మాయి... మన వెలుగమ్మాయి. - ఎ. సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు), సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మాస్టారు
-
రావి ఆకుపై వైఎస్సార్ చిత్రం
సనత్‌నగర్, న్యూస్‌లైన్: తన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావిఆకుపై చిత్రించి అబ్బురపరిచారు.. మారిషస్ దేశంలో పుట్టి పెరిగిన తెలుగు చిత్రకారుడు సంజీవ నరసింహ అప్పడు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడిగా పనిచేసే ఆయన చిత్రకళను ప్రవృత్తిగా మలచుకున్నారు. ముఖ్యంగా రావి ఆకులపై బొమ్మలు వేయడంలో సిద్ధహస్తుడు. 1400 బొమ్మల్ని రావిఆకులపై వేసి రికార్డు సృష్టించిన ఆయన.. వైఎస్ఆర్ చిత్రాన్ని వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల మారిషస్‌లో పర్యటించి వచ్చిన ప్రయోగాత్మక దర్శకుడు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు గ్రహీత పీసీ ఆదిత్య ఆయన వేసిన చిత్రాలను తిలకించి సన్మానించారు. వచ్చే నెల మొదటి వారంలో నరసింహఅప్పడు నగర పర్యటనకు వస్తున్న సందర్భంలో వైఎస్ఆర్సీతన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని రావిఆకుపై చిత్రించి అబ్బురపరిచారు.. మారిషస్ దేశంలో పుట్టి పెరిగిన తెలుగు చిత్రకారుడు సంజీవ నరసింహ అప్పడు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడిగా పనిచేసే ఆయన చిత్రకళను ప్రవృత్తిగా మలచుకున్నారు.పీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మికి తాను వేసిన వైఎస్ చిత్రాన్ని అందజేయనున్నారు.