ఆ నటుడి కోసం ‘ఖాన్‌ త్రయం’...? | Irrfan Movie Blackmail Prometed By Three Khans | Sakshi
Sakshi News home page

ఆ నటుడి కోసం ముందుకొచ్చిన ‘ఖాన్‌ త్రయం’...?

Published Tue, Apr 3 2018 2:06 PM | Last Updated on Tue, Apr 3 2018 5:25 PM

Irrfan Movie Blackmail Prometed By Three Khans - Sakshi

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఉంది ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రస్తుత పరిస్థితి. ఇర్ఫాన్‌ నటించిన చిత్రం బ్లాక్‌మెయిల్‌. ఈ చిత్ర ప్రమోషన్‌ కోసం ఇర్ఫాన్‌ ఎంతో ఆతురుతగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. న్యూరో ఎండోక్రైన్‌ వ్యాధితో బాధపడుతున్న అతడు  ప్రస్తుతం యూకేలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ పరిస్ధితులో  ఇర్ఫాన్‌కు సహయం చేయడానికి బాలీవుడ్‌ ఖాన్‌ల త్రయం ముదుకొచ్చారు. షారుఖ్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు ప్రత్యేక షో వేయించుకుని​ చూడనున్నట్లు, ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేయనున్నట్లు సమాచారం. ఇలా ముగ్గురు ఖాన్‌లు కలవడమే అరుదు. ఇదేకానీ జరిగితే అభిమానులకు పండగే. అభినయ్‌ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్‌తో పాటు కీర్తి కుల్హర్‌, దివ్య దత్తా, అరుణోదయ్‌ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement