
న్యూఢిల్లీ: దేశంలోని ఐఏఎస్ అధికారులంతా తమ ఆస్తుల వివరాలను జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా వివరాలు సమర్పించకపోతే వారికి విజిలెన్స్ విభాగం క్లియరెన్స్ ఇవ్వదనీ, తత్ఫలితంగా పదోన్నతులకు గానీ, విదేశాల్లో పోస్టింగ్స్ పొందడానికిగాని అనర్హులవుతారని హెచ్చరించింది. ఆస్తులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం దేశంలో 5,004 మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారు.