property details
-
కాంగ్రెస్‌లో ‘ఆస్తుల గణన’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తన ఆస్తుల లెక్క తేల్చుకునే పనిలో పడింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉన్న ఆస్తుల వివరాల ను సేకరించడంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలోనూ ఉన్న ఆస్తుల లెక్క తేల్చేందుకు టీపీసీసీ సిద్ధమవుతోంది. గాందీభవన్ నుంచి మండల స్థాయిలో లేదా రెవెన్యూ డివిజన్ లేదా జిల్లా స్థాయిలో పార్టీకి కార్యాలయాలున్నాయా? ఆ కార్యాలయాలు ఎవరి పేరిట ఉన్నాయి? ఆ కార్యాలయాల ద్వారా వస్తున్న ఆదాయం సక్రమంగా వినియోగం అవుతుందా? లేదా? అనే వివరాలను సేకరించనున్నారు. ఎక్కడెక్కడ... ఎవరి చేతుల్లో? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో, పలు రెవెన్యూ డివిజన్లలో కూడా పార్టీ కార్యాలయాలు సొంతంగా ఉన్నాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయమైన గాం«దీభవన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నిర్మించినప్పటికీ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హాయాంలో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి యాజమాన్య హక్కులు ఆ ట్రస్టుకు దఖలు పరిచారు. గాంధీభవన్‌ను వినియోగించుకున్నందుకు గాను ఈ ట్రస్టుకు నెలకు నామమాత్రపు అద్దెను కూడా పార్టీ చెల్లిస్తోంది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో ఉన్న కార్యాలయాలు పలువురు వ్యక్తులు, ట్రస్టుల పేరిట ఉన్నాయి. ఖమ్మం, కరీంనగర్ పార్టీ కార్యాలయాల విషయంలో ఏ ఇబ్బంది లేనప్పటికీ వరంగల్ జిల్లా లోని పార్టీ కార్యాలయాన్ని ఇతర వ్యక్తులు ట్రస్టీల రూపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదాయం వారే తీసుకుంటున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నా యి. భద్రాచలంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తి కంప్యూటర్ సెంటర్ పెట్టి సొంతానికి వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది. దిగ్విజయ్ నేతృత్వంలో... సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వివరాల సేకరణ కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని పార్టీ ఆస్తుల వివరాలను సేకరించేందుకు గాను ఏఐసీసీ నుంచి కుంభల్కర్‌ను ఇన్చార్జిగా నియమించగా, త్వరలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కమిటీని ప్రకటించనున్నారు. కమిటీ ప్రకటన అనంతరం జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఏయే ఆస్తులు న్నా యి? ఆయా ఆస్తుల ద్వారా ఏమైనా ఆదాయం వస్తోందా? వస్తున్న ఆదాయం రాష్ట్ర పార్టీ కి, జాతీయ పార్టీ కి అందుతోందా? ఒకవేళ అందకపోతే కారణాలేంటి? ఆస్తుల రక్షణ విషయంలో ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ‘కోఠి’ఆఫీసు పరిహారం ఎవరికెళ్లిందో? హైదరాబాద్ నగర కమిటీకి కోఠిలో ఓ కార్యాలయం ఉండేది. మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా ఆ కార్యాలయం కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం ఎవరు తీసుకున్నారన్న దానిపై కూడా ఆరోపణలున్నాయి. గాందీభవన్ స్థానంలో పక్కనే ఉన్న భీంరావ్‌వాడలో ఇందిరాభవన్‌ను నిర్మించాలని మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉన్న ప్పుడు స్థలం కేటాయించారు. ఇందుకు గానూ హౌసింగ్‌బోర్డుకు రుసుము చెల్లించారు. కానీ, ఆ తర్వాత అక్కడ భవనాన్ని నిర్మించే పరిస్థితి లేకపోవడంతో ఆ స్థలం కూడా పెండింగ్‌లో పడిపోయింది. ఆస్తుల లెక్కలు తేల్చడం ద్వారా ట్రస్టీల అధికారాలను పార్టీ తీసుకోవడంతో పాటు ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో వివరాలు సేకరిస్తున్నట్టు గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!
సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 2003లో కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఆ తరువాత తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బహూభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిపోయింది. ఇక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పటి వరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 చిత్రాలు చేసింది. ప్రస్తుతం చిత్రానికి రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఆమె గురించి తెలిసిన విషయాలు అయితే తాజాగా ప్రచారంలో ఉన్న కథనం ఏంటంటే.. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ రూ.165 కోట్లు. ఇది నయనతార ఆదాయశాఖకు దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం జరుగుతున్న ప్రచారం. ఈమె సినిమాలో నటిస్తునే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. దీనికి ఒక్కో సంస్థ నుంచి రూ.5 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలో తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు అంటూ దేశవ్యాప్తంగా పలు సొంత నివాసాలను ఏర్పరచుకుంది. హైదరాబాదులోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.15 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. అక్కడ అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో నయనతార ప్లాట్లు కొనుగోలు చేసింది. అదే విధంగా ఇటీవల ఈమె ఒక జెట్ విమానాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక వ్యాపార రంగంలోనూ నయనతార దూసుకుపోతుంది. డాక్టర్ వనిత రాజన్‌తో కలిసి లిప్ బామ్ కంపెనీని ప్రారంభించింది. ఇటు సినీ నిర్మాతగానూ బాగానే సంపాదిస్తోంది. -
'ఆస్తుల వివరాలు సమర్పించండి'.. హీరో విశాల్‌కు కోర్టు ఆదేశాలు
తమిళసినిమా: లైకా ప్రొడక్షన్స్‌కు అప్పు చెల్లింపుల కేసులో నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టు మరింత గడువు ఇస్తూ సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు.. విశాల్ తమకు రూ.21.29 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందంటూ లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా విశాల్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో ఇటీవల కోర్టుకు హాజరైన విశాల్ తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయానని తెలిపారు. అయితే తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్‌ను ఆదేశించారు. ఈ కేసు విచారణ శుక్రవారం మరోసారి న్యాయమూర్తి ఎం.సుందర్ సమక్షంలో విచారణకు వచ్చింది. విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరై ప్రమాణ పత్రం కోర్టులో సమర్పించడానికి మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి మరో రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
‘ఆస్తుల వివరాలు చెబితేనే ప్రమోషన్లు’
న్యూఢిల్లీ: దేశంలోని ఐఏఎస్ అధికారులంతా తమ ఆస్తుల వివరాలను జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా వివరాలు సమర్పించకపోతే వారికి విజిలెన్స్ విభాగం క్లియరెన్స్ ఇవ్వదనీ, తత్ఫలితంగా పదోన్నతులకు గానీ, విదేశాల్లో పోస్టింగ్స్ పొందడానికిగాని అనర్హులవుతారని హెచ్చరించింది. ఆస్తులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం దేశంలో 5,004 మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారు. -
ఓ లుక్కేద్దాం
– టీడీపీ నేత షకిల్‌షఫీ కుటుంబసభ్యుల నుంచి 204.03 ఎకరాల కొనుగోలు – ప్రతిఫలంగా నగదుతో పాటు షకిల్‌షఫీ తండ్రికి వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గిరి కట్టబెట్టే వ్యూహం – ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మద్దతూ కూడగట్టిన వైనం – ‘పల్లె’ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – టీడీపీలో చిచ్చురేపుతోన్న వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక వ్యవహారం (సాక్షి ప్రతినిధి, అనంతపురం) వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి విషయమై టీడీపీలో చిచ్చురేగుతోంది. తన అస్మదీయుణ్ని చైర్మన్ చేయాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీన్ని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మినహా తక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం జిల్లా టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీలోని కీలక వర్గాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఆలమూరు సమీపంలో (నగరానికి అతి దగ్గరగా..) 204.03 ఎకరాల భూమిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొనుగోలు చేశారు. ఇందులో 117.04 ఎకరాలను గత ఏడాది జూలై 25న, మరో 86.99 ఎకరాలను అక్టోబరు 26న కొన్నారు. మొత్తం భూములను బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, దాని ప్రస్తుత అధ్యక్షుడు పల్లె రఘునాథరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూములను అనంతపురానికి చెందిన టీడీపీ నేతలు కేఎం షఫీవుల్లా, కేఎం షకిల్‌షఫీ, వారి కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నారు. ఇక్కడ ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ.15–20 లక్షల వరకు ధర పలుకుతోంది. మంత్రి మాత్రం రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఎకరానికి రూ.1.50 లక్షలు చెల్లించారు. తక్కిన మొత్తాన్ని నగదు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే రిజిస్ట్రేషన్‌లో రూ.3.6 కోట్లు అధికారికంగా చూపించి, అనధికారికంగా రూ.27–30 కోట్లు చెల్లించినట్లు సమాచారం. పదవి కోసం ఒప్పందం! భూ లావాదేవీల సమయంలో షఫీవుల్లాకు, మంత్రి పల్లెకు మధ్య ఓ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. భూములు ఇస్తున్నందున ప్రతిఫలంగా తనకు వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి దక్కేలా చూడాలని షఫీవుల్లా కోరినట్లు సమాచారం. అయితే.. తాను మైనార్టీశాఖ మంత్రి అయినప్పటికీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుందని, దీనిపై తాను హామీ ఇవ్వలేనని మంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రికి మరో బాధ్యతను అప్పగించారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియలో మొదటగా 11మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఒక డైరెక్టర్‌ను చైర్మన్ చేస్తారు. ముతవల్లిల కోటాలో ఒకరిని డైరెక్టర్‌గా నామినేట్ చేసే అవకాశముంది. తనను నామినేట్ చేసే బాధ్యతను పల్లెకు అప్పగించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అయిన తర్వాత చైర్మన్ కోసం మరో ప్రయత్నం చేయొచ్చనేది షఫీవుల్లా ఆలోచనగా ఉంది. టీడీపీలో మైనార్టీలెవరూ ఎమ్మెల్యేలుగా విజయం సాధించలేదు. అరువొచ్చిన జలీల్‌ఖాన్, చాంద్‌బాషా కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తనకున్న లాబీతో వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గిరి దక్కించుకోవాలని షఫీవుల్లా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు చేజారితే మరెప్పుడూ దక్కదనే ఆలోచనతో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షఫీవుల్లా తెలంగాణ ఏసీబీ డీజీ ఏకేఖాన్కు స్వయాన మామ. ఆయన కుమారైను ఏకేఖాన్ వివాహం చేసుకున్నారు. టీడీపీలో ధిక్కార స్వరం ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు పలువురు ముఖ్య నేతల వద్ద పల్లె ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదనను అనంతపురం ఎమ్మెల్యే మినహా జిల్లా టీడీపీలోని దాదాపు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించినట్లు సమాచారం. షఫీవుల్లా కుటుంబం టీడీపీని అడ్డుపెట్టుకుని లబ్ధిపొందడం మినహా పార్టీకి వారు చేసేందేమీ లేదని, అయినప్పటికీ షఫీవుల్లా కుమారుడు షకిల్షఫీని శాప్ డైరెక్టర్ చేశామని, తిరిగి అదే కుటుంబానికి వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రతిపాదన తేవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పల్లె ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కేబినెట్ విస్తరణతో పాటు వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపిక కూడా చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ విస్తరణలో పల్లె పోస్టు ఉంటుందా, ఊడుతుందా అనే అంశంపై స్పష్టత లేదని, ఈ క్రమంలో తన పోస్టును కాపాడుకుంటే చాలని, వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఎంపికలో తలదూర్చడం ఏంటని ఇద్దరు ఎమ్మెల్యేలు పల్లెపై విమర్శలు గుప్పిస్తున్నారు. -
విద్యాశాఖ ఉద్యోగులు ఆస్తులను వెల్లడించాలి!
జనవరి 10 లోగా చర్యలు చేపట్టాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను(యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ స్టేట్మెంట్–ఏపీఆర్) వెల్లడించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో దీనికి తగు చర్యలు చేపట్టాలని ఆర్జేడీలను, డీఈవో లను ఆదేశిస్తూ పాఠశాల విద్యాడైరెక్టర్ కిషన్ ఉత్తర్వు లు జారీ చేశారు. సీసీఎస్ రూల్స్‌లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏటా జనవరి 15లోగా తమ ఏపీఆర్‌లను అందజేయాలనే నిబంధన అమలుకు చర్యలు చేపట్టా లన్నారు. వచ్చే జనవరి 10లోగా ఆర్జేడీలు, డీఈవోల పరిధిలో పనిచేసే 1.30 లక్షల టీచర్లు, మరో 6 వేల బోధనేతర సిబ్బంది ఏపీఆర్‌లను అందజేసేలా చర్య లు చేపట్టాలని తెలిపారు. పాఠశాల విద్య అదనపు డైరెక్టర్లు, ఆర్జేడీలు, జాయింట్ డైరెక్టర్లు, ఐఏఎస్ఈ/ సీటీఈ, ఎస్సీఈఆర్టీ, డైట్ ప్రొఫెసర్లు, డీఈవోలం తా తమ ఏపీఆర్‌లను జనవరి 10లోగా పాఠశాల విద్యా డైరెక్టర్ (డీఎస్ఈ)కు అందజేయాలన్నారు. ఈ నిబంధనలను పాటించకపోతే శాఖాపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తు లను వెల్లడించాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 1998 ఫిబ్రవరి 4న జీవో నంబర్ 52ను పెద్దగా అమలు చేయలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆస్తుల వెల్లడి జీవో అమలుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ రిటర్న్ పాన్ నంబరుతో సహా నిర్ణీత ఫార్మాట్లో పొం దుపరుచాలి. అందులో ఎలాంటి తప్పుడు సమాచా రమున్నా చర్యలు తీసుకోవచ్చని డిక్లరేషన్ ఇవ్వాలి. -
కుటుంబసభ్యుల ఆస్తిపాస్తులు చెప్పాల్సిందే
లోక్‌పాల్ చట్టం కింద కేంద్ర ఉద్యోగులకు కొత్త నిబంధన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇకపై తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు లోక్‌పాల్ చట్టం కింద ఉన్న నిబంధనలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం ఉద్యోగులంతా తమతో పాటు తమ భార్యాపిల్లల పేరుపై ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను డిక్లరేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. తమ వద్ద ఉన్న సొత్తు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్ల వంటి వాటిలో పెట్టుబడులు, ఇన్యూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు, పీఎఫ్, కంపెనీల్లో వాటాలు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, వ్యక్తిగత లోన్లు వంటి వివరాలన్నింటినీ అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ మేరకు వివరాలు నింపాల్సిన కొత్త దరఖాస్తు ఫారాలను కూడా కేంద్ర సిబ్బంది శిక్షణా శాఖ గత వారం విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటికే డిక్లరేషన్లు ఇచ్చిన ఉద్యోగులు కూడా సెప్టెంబర్ 15లోగా మళ్లీ డిక్లరేషన్లు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఈ అభ్యర్థుల ఆస్తులు వందల కోట్లు
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ :నరసాపురం పార్లమెంటరీ స్థానంలో నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల ముగ్గురి ఆస్తులు వంద కోట్ల పైమాటే. బీజేపీ, టీడీపీ తరుపున నామినేషన్లు దాఖలు చేసిన కనుమూరి రఘురామకృష్ణంరాజు, బీజేపీ అభ్యర్థి గోకరాజు రంగరాజు తమ ఆస్తుల విలువను గురువారం వెల్లడించారు. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంక రవీంద్రనాథ్ బుధవారమే ఆస్తుల వివరాలు వెల్లడించిన విషయం విదితమే. ఈ ముగ్గురు అభ్యర్థుల ఆస్తులు వందలకోట్లు పైబడి ఉండడం విశేషం. ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు తన భార్య రమాదేవితో కలిపి మొత్తం రూ.772,04,25,085 విలువైన స్థిర చరాస్తులు ఉన్నట్టు 40 పేజీల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో రఘురామకృష్ణం రాజు పేరుపై రూ.480,85,37,199, ఆయన భార్య పేరుపై రూ.291,18,87,882 విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. తాను స్వయంగా సంపాదించిన ఆస్తులు రూ. 332 కోట్లుగా తెలిపారు. వివిధ బ్యాంకుల్లో రఘురామకృష్ణంరాజుకు రూ.57,23,20,000, ఆయన భార్యకు రూ.14,88,85,000 మొత్తంగా రూ.72,12,05,000 అప్పులు ఉన్నట్టు చూపించారు. గోకరాజు ఆస్తి రూ.297 కోట్లు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలుచేసిన గోకరాజు గంగరాజుకు, ఆయన భార్య లైలాకు కలిపి రూ. 297,46,66,294 ఆస్తులు ఉన్నట్టు రిటర్నింగ్ అధికారికి సమర్పించిన 38 పేజీల అఫిడవిట్లో పేర్కొన్నారు. రంగరాజుకు రూ.237,73,35,820 స్థిరచరాస్తులు, ఆయన భార్యకు రూ.59,73,30,474 స్థిర చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. వాటిలో ఆయనకు రూ.192 కోట్ల విలువైన వ్యాపార సంస్థలు, భూములు, నివాస భవనాలు, వాహనాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన భార్యకు రూ.29.15 కోట్లు విలువైన నివాస భవనాలు, భూములు ఉన్నట్టు వివరించారు. రంగరాజుకు రూ.10,57,42,600, ఆయన భార్యకు రూ. 6,27,58,686 మొత్తం రూ.16.85 కోట్ల అప్పులు చూపించారు. -
పోలీసు విభజన షురూ!
విభాగాల వారీగా స్థానికత నమోదు రాష్ట్రం వెలుపలనున్న ఆస్తుల వివరాల సేకరణ ప్రస్తుత భవనంలోనే రెండు రాష్ట్రాల డీజీపీలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో విభజన ప్రక్రియ మొదలైంది. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది, ఆస్తుల వివరాల సేకరణపై దృష్టి సారించారు. సిబ్బంది స్థానికతను తెలుసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం, సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ తదితర విభాగాలలో పని చేస్తున్న పోలీసు ఎగ్జిక్యూటివ్, మినిస్టీరియల్ సిబ్బంది స్థానికతతో పాటు ఇతర వివరాలు సేకరించే ప్రక్రియను వేగవంతం చేశారు. మరోవైపు పోలీసు శాఖకు రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు. - పుట్టిన స్థలం, విద్యాభ్యాసం తదితర వివరాలతో కూడిన పత్రాలను సిబ్బంది నుంచి తీసుకుంటున్నారు. ఈ వివరాలను క్రోడీకరించి రికార్డులు సిద్ధం చేస్తున్నారు. - ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ)కు రాష్ట్రంలో 17 బెటాలియన్లు ఉండగా.. అందులో 10 తెలంగాణ జిల్లాల్లో, 7 సీమాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్రస్థాయి రిక్రూట్మెంట్ కావడంతో.. తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందిలో ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారు. పూర్తి వివరాలు సేకరించాక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు సిబ్బంది పంపిణీ ప్రారంభించాలని డీజీపీ కార్యాలయం అధికారులు నిర్ణయించారు. - ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖకు ఉన్న భవనాలు, స్థలాలు, ఇతర ఆస్తుల జాబితాను రూపొందించిన అధికారులు.. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రం వెలుపల ఉన్న వాటి వివరాల సేకరణపై దృష్టి పెట్టారు. ఈ వివరాల కోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ (ఏపీపీహెచ్‌సీ)కి లేఖ రాశారు. నగర పోలీసు, ఇతర కీలక విభాగాలకూ వర్తమానం పంపారు. వీలైనంత త్వరగా పూర్తి సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. - విజయవాడ సమీపంలో ఆక్టోపస్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తిరుపతిలో మాత్రమే ఈ హబ్స్ ఉన్నాయి. - రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోతోంది. దీంతో ప్రస్తుత డీజీపీ కార్యాలయ భవనంలోనే.. మరో డీజీపీకి కొంత స్థలాన్ని కేటాయించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్త భవనం సమకూరే వరకూ సీఐడీ, ఇంటెలిజెన్స్ కార్యాలయాలూ.. డీజీపీ కార్యాలయ భవనంలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.