లోక్‌పాల్ చట్టం కింద కేంద్ర ఉద్యోగులకు కొత్త నిబంధన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇకపై తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు లోక్‌పాల్ చట్టం కింద ఉన్న నిబంధనలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం ఉద్యోగులంతా తమతో పాటు తమ భార్యాపిల్లల పేరుపై ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను డిక్లరేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. తమ వద్ద ఉన్న సొత్తు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్ల వంటి వాటిలో పెట్టుబడులు, ఇన్యూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు, పీఎఫ్, కంపెనీల్లో వాటాలు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, వ్యక్తిగత లోన్లు వంటి వివరాలన్నింటినీ అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ మేరకు వివరాలు నింపాల్సిన కొత్త దరఖాస్తు ఫారాలను కూడా కేంద్ర సిబ్బంది శిక్షణా శాఖ గత వారం విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటికే డిక్లరేషన్లు ఇచ్చిన ఉద్యోగులు కూడా సెప్టెంబర్ 15లోగా మళ్లీ డిక్లరేషన్లు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.
కుటుంబసభ్యుల ఆస్తిపాస్తులు చెప్పాల్సిందే
Published Tue, Jul 22 2014 3:00 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement