Lokpal Act
-
వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ వ్యాపారవేత్త రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికల అఫిడ్‌విట్‌లో పేర్కొన్న ఆయన, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు చూస్తే ఎవరైనా కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. తాను నిర్వహిస్తున్న వివిధ కంపెనీల నుంచి తనకు ఏటా 28 కోట్ల రూపాయలు వస్తున్నాయని, తన కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం 65 కోట్ల రూపాయలని తెలిపారు. తాను 1942 మోడల్ ‘రెడ్ ఇండియన్ స్కౌట్’ కారును 2004లో పది వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. స్టాక్ ఎక్స్ఛేంచ్లో నమోదుకాని ‘వెంక్ట్రా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎస్పీఎల్ ఇన్ఫోటెక్ పీటీఈ, జూపిటర్ గ్లోబల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, మిన్స్క్ డెవలపర్స్, ఆర్సీ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్, శాంఘైన్ న్యూ మీడియా’ కంపెనీల్లో తనకు ఈక్విటీ షేర్లు ఉన్నాయని, ఈ షేర్ల ద్వారా ఏటా 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని ఆయన వివరించారు. 58 అనుబంధ కంపెనీలు కలిగిన అతిపెద్ద కంపెనీ ‘జూపిటర్ క్యాపిటల్’ పేరును ఆయన తన అఫిడవిట్లో పొందుపర్చలేదు. ఈ కంపెనీలో 90 శాతం వాటా ఆయనదే. ఆయన 2005లో ఈ కంపెనీని స్థాపించారు. మొదటి సంవత్సరం నాలుగు అనుబంధ కంపెనీల ద్వారా ఆ కంపెనీకి 15.08 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కంపెనీ వేగంగా అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. కంపెనీ 2018లో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదిక ప్రకారం కంపెనీకి 58 అనుబంధ కంపెనీలు ఉన్నాయి. వాటిలో సువర్ణ న్యూస్, ఆసియా నెట్, ఇండిగో 91.9 ఎఫ్ఎం, రిపబ్లిక్ టీవీ, ఆక్సిస్కేడ్ (టెక్నాలజీ సంస్థ), ఇండియన్ ఎయిరో వెంచర్స్ లాంటి పలు డిఫెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆదాయం జూపిటర్ కంపెనీ 2018, మార్చి నెలలో ‘రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్’ సమర్పించిన నివేదికలో కంపెనీ పెట్టుబడుల విలువను 7,100 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. 2018, మార్చి నెల నాటికి 1,026 కోట్ల రూపాయలను వార్షికాదాయంగా చూపించారు. ఈ కంపెనీ గురించి రాజీవ్ చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం. ఆయన 2014 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్ట్ 30వ తేదీ వరకు డిఫెన్స్ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులుగా కొనసాగారు. అప్పుడు సొంతంగా డిఫిఎన్స్ కంపెనీలు కలిగిన వ్యక్తిని పార్లమెంటరీ స్థాయి సంఘంలోకి ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ ఎంపీలు గొడవ చేశారు. వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ తరఫున చర్చలు జరిపిన కమిటీలో కూడా ఈ రాజీవ్ చంద్రశేఖర్ సభ్యుడిగా ఉన్నారు. అనేక లగ్జరీ కార్లు ఆయన సొంతం చంద్రశేఖర్ తాను 2004లో పది వేల రూపాయలతో ఓ డొక్కు కారును కొన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. హెరిటేజ్ కార్లకు లక్షల్లో, కోట్లలో డిమాండ్ ఉంటుందన్న విషయం తెల్సిందే. వ్యాపారవేత్తలు ఎవరైనా కంపెనీల పేరిటే కార్లను కొంటారని తెల్సిందే. ఆయనకు ‘ఫెరారీ డినో, ఫెరారీ ఎఫ్555 స్పైడర్, లంబోర్గినీ ముర్సీలగో, బీఎండబ్ల్యూ ఎం5 (ఎఫ్ 60), హమ్మర్ హెచ్2 లాంటి అతి ఖరీదైన, అతి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అఫిడవిట్లోనూ తప్పులే తనకు ఆరు కంపెనీల నుంచి ఏటా 28 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని 2018, మార్చి 12వ తేదీన సమర్పించిన అఫిడవిట్లో రాజీవ్ పేర్కొన్నారు. అయితే అవి ఫిబ్రవరి 28వ తేదీ నాటి లెక్కలని చెప్పారు. 2018, మార్చి 30వ తేదీ నాటికి ఈ ఆరు కంపెనీలకు కలిపి 313 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కంపెనీ ఆర్థిక రిటర్న్స్‌లో చూపించారు. లోక్‌పాల్ విచారించాల్సిందే! ప్రధాని సహా మంత్రులు, పార్లమెంట్ సభ్యుల అవినీతిని విచారించే అధికారంగల లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్‌ను కేంద్రం ఆదివారమే ఖరారు చేసిన విషయం తెల్సిందే. ప్రధాని నేతత్వంలోని కమిటీ నియమించే లోక్‌పాల్ చైర్మన్, ప్రధానిపై వచ్చే ఆరోపణలను చిత్తశుద్ధిగా విచారిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. పాలకపక్షం బీజేపీ తరఫున గత మార్చి నెలలో గెలిచిన రాజీవ్ చంద్రశేఖర్, తన అఫిడవిట్లో అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను బోల్తా కొట్టించినందుకు ఆయనపై లోక్‌పాల్ విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవినీతి ప్రక్షాళన దిశగా తొలి అడుగు వేయాలి. -
వచ్చేది వెయ్యి కోట్లు పైనే చూపింది 28 కోట్లు
-
సీబీఐ ప్రతిష్టను దిగజార్చడం కాదా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకే ఇరువురు సిబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఐ సంస్థాగత రుజువర్తన, విశ్వసనీయతను పెంచేందుకు ఈ చర్య తీసుకోక తప్పడం లేదు’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెల్సిందే. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు నాటకీయంగా సీబీఐ కార్యాలయంపై దాడిచేసి, తనిఖీలు నిర్వహించడం, సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ డిప్యూటీ రాకేశ్ అస్థానాలను సెలవుపై పంపించే ఉత్తర్వులను సర్వ్ చేయడం తదితర పరిణామాల నేపథ్యంలోనే అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రస్థావనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ తీసుకరావడానికి సందర్భం ఉంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ రాజకీయ సానుకూలత చూపించడమే కాకుండా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ అస్థానా గత ఆగస్టు 24వ తేదీన కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకొనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇరువురిని సెలవుపై పంపించాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేసినట్లు అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. 1988 అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ డైరెక్టర్‌పై కేసు నమోదైన పక్షంలోనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాలి. లేనట్లయితే జోక్యం చేసుకోకూడదు. అలోక్ వర్మపై ఎలాంటి అవినీతి కేసు దాఖలు కాలే దు. అలాంటప్పుడు విజిలెన్స్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఎందుకు జోక్యం చేసుకొంది? అసలు జోక్యం చేసుకుందా? ప్రభుత్వమే విజిలెన్స్ కమిషన్‌ను ఓ సాకుగా వాడుకుందా? ఇక సీబీఐ డైరెక్టర్ పదవి రెండేళ్లు ఉంటుంది. ఎంతటి తీవ్ర పరిస్థితుల్లో కూడా ఆయన్ని విధుల నుంచి తప్పించడానికి వీల్లేదు. అయినా చర్య తీసుకోవాల్సినంత తీవ్ర పరిస్థితులు ఉత్పన్నం అయితే 2013 నాటి లోక్‌పాల్ చట్టం ప్రకారం ‘సెలక్షన్ కమిటీ’ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. సెలక్షన్ కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన సుప్రీం కోర్టు జడ్జీ సభ్యులుగా ఉంటారన్న విషయం తెల్సిందే. ‘సెలక్షక్ కమిటీ’ అనుమతి లేకుండానే సీబీఐ అధికారులపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు ఇక్కడ స్పష్టం అవుతుంది. కేంద్రం ఆదేశాల మేరకు అర్ధరాత్రి సీబీఐ కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు చుట్టుముట్టడం, డైరెక్టర్ ఆఫీసును తనిఖీ చేయడం, ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన డైరెక్టర్ వస్తూ రాగానే పాత డైరెక్టర్ అనుచరులుగా భావించిన 13 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం తదితర పరిణామాలు సీబీఐ ప్రతిష్టను నిలబెట్టేవా, మరింత దిగజార్చేవా? -
లోక్‌పాల్‌ను నిర్వీర్యం చేశారు
సాక్షి,న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం అవినీతి నిరోధక లోక్‌పాల్ చట్టాన్ని నీరుగార్చిందని సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆరోపించారు. అరుదుగా మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన హయాంలో లోక్‌పాల్ చట్టాన్ని బలహీనంగా రూపొందించారు. ప్రస్తుత ప్రధాని మోదీ దాన్ని మరింత నిర్వీర్యం చేశారని అన్నారు. ప్రభుత్వ అధికారుల భార్య, కుమారుడు, కుమార్తె ఏటా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని 2016 జులైలో చట్టానికి సవరణలు చేశారని గుర్తుచేశారు. చట్ట ప్రకారం అధికారుల కుటుంబ సభ్యులు తమ ఆస్తులను ఏటా వెల్లడించాలనే నిబంధన ఉందని చెప్పారు. కేవలం ఒక్క రోజులోనే ఎలాంటి చర్చ చేపట్టకుండా లోక్‌సభలో సవరణ బిల్లును ఆమోదించారని అన్నారు. దేశంలో 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ 5000 పెన్షన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
లోక్‌పాల్ నియామకంలో జాప్యం సరికాదు
-
లోక్‌పాల్ చట్టంలో సవరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోల నిర్వాహకులు ఆస్తులు వెల్లడించే విషయంలో కేంద్రం లోక్‌పాల్ చట్టాన్ని సవరించింది. ఆస్తుల వివరాల దాఖలులో ఉద్యోగి జీవిత భాగస్వామిని, ఆధారపడి ఉన్న పిల్లలను మినహాయించింది. అయితే 2013 లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల ప్రకారం ప్రతియేటా ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆస్తులతో పాటు జీవిత భాగస్వామి, పిల్లల ఆస్తులు కూడా వెల్లడించాలి. సవరణ బిల్లు గురువారం పార్లమెంట్ ఆమోదించిందని, కొత్త చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలని సిబ్బంది,శిక్షణ విభాగం తెలిపింది. -
‘లోక్‌పాల్’ అమలు కోసం త్వరలో దీక్ష
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే వెల్లడి హైదరాబాద్: లోక్‌పాల్ చట్టం సత్వర అమలు కోసం మరో పోరాటం చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు, గాంధేయవాది అన్నాహజారే ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘపోరాటం అనంతరం మునుపటి యూపీఏ ప్రభుత్వం చేసిన లోక్‌పాల్ చట్టం అమలుపై ప్రస్తుత సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. శనివారం హైదరాబాద్ వనస్థలిపురంలో చెరుకూరి గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామారావు ఆధ్వర్యంలో ‘సాయి దేశం- గాంధీ మార్గం’ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఛత్రపతి శివాజీ గ్రౌండ్లో జరిగిన సభలో పాల్గొని యువత, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సమాజమే ఒక కుటుంబంగా భావించి, అందరితో కలసిమెలసి జీవిస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని అన్నారు. ప్రతి ఒక్కరూ తాను బతుకుతూ సమాజాన్ని బతికించాలన్న స్వామి వివేకానందుని మాటలను పాటించాలని పిలుపునిచ్చారు. అందరూ గాంధేయ మార్గంలో పయనించి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘ సేవకులు రంగయ్య గౌడ్, సంజయ్‌కుమార్, డాక్టర్ సురేశ్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహెబ్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. -
కుటుంబసభ్యుల ఆస్తిపాస్తులు చెప్పాల్సిందే
లోక్‌పాల్ చట్టం కింద కేంద్ర ఉద్యోగులకు కొత్త నిబంధన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇకపై తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మేరకు లోక్‌పాల్ చట్టం కింద ఉన్న నిబంధనలను కేంద్రం తాజాగా నోటిఫై చేసింది. దీని ప్రకారం ఉద్యోగులంతా తమతో పాటు తమ భార్యాపిల్లల పేరుపై ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను డిక్లరేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. తమ వద్ద ఉన్న సొత్తు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్ల వంటి వాటిలో పెట్టుబడులు, ఇన్యూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు, పీఎఫ్, కంపెనీల్లో వాటాలు, వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, వ్యక్తిగత లోన్లు వంటి వివరాలన్నింటినీ అందులో పేర్కొనాల్సి ఉంటుంది. ఈ మేరకు వివరాలు నింపాల్సిన కొత్త దరఖాస్తు ఫారాలను కూడా కేంద్ర సిబ్బంది శిక్షణా శాఖ గత వారం విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటికే డిక్లరేషన్లు ఇచ్చిన ఉద్యోగులు కూడా సెప్టెంబర్ 15లోగా మళ్లీ డిక్లరేషన్లు ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది.