ఎన్‌జీవోల నిర్వాహకులు ఆస్తులు వెల్లడించే విషయంలో కేంద్రం లోక్‌పాల్ చట్టాన్ని సవరించింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌జీవోల నిర్వాహకులు ఆస్తులు వెల్లడించే విషయంలో కేంద్రం లోక్‌పాల్ చట్టాన్ని సవరించింది. ఆస్తుల వివరాల దాఖలులో ఉద్యోగి జీవిత భాగస్వామిని, ఆధారపడి ఉన్న పిల్లలను మినహాయించింది.
అయితే 2013 లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల ప్రకారం ప్రతియేటా ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆస్తులతో పాటు జీవిత భాగస్వామి, పిల్లల ఆస్తులు కూడా వెల్లడించాలి. సవరణ బిల్లు గురువారం పార్లమెంట్ ఆమోదించిందని, కొత్త చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాలని సిబ్బంది,శిక్షణ విభాగం తెలిపింది.