జనవరి 10 లోగా చర్యలు చేపట్టాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ ఉద్యోగులు ఏటా తమ ఆస్తుల వివరాలను(యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ స్టేట్‌మెంట్–ఏపీఆర్) వెల్లడించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో దీనికి తగు చర్యలు చేపట్టాలని ఆర్జేడీలను, డీఈవో లను ఆదేశిస్తూ పాఠశాల విద్యాడైరెక్టర్ కిషన్ ఉత్తర్వు లు జారీ చేశారు. సీసీఎస్ రూల్స్‌లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఏటా జనవరి 15లోగా తమ ఏపీఆర్‌లను అందజేయాలనే నిబంధన అమలుకు చర్యలు చేపట్టా లన్నారు. వచ్చే జనవరి 10లోగా ఆర్జేడీలు, డీఈవోల పరిధిలో పనిచేసే 1.30 లక్షల టీచర్లు, మరో 6 వేల బోధనేతర సిబ్బంది ఏపీఆర్‌లను అందజేసేలా చర్య లు చేపట్టాలని తెలిపారు.
పాఠశాల విద్య అదనపు డైరెక్టర్లు, ఆర్జేడీలు, జాయింట్ డైరెక్టర్లు, ఐఏఎస్‌ఈ/ సీటీఈ, ఎస్‌సీఈఆర్‌టీ, డైట్ ప్రొఫెసర్లు, డీఈవోలం తా తమ ఏపీఆర్‌లను జనవరి 10లోగా పాఠశాల విద్యా డైరెక్టర్ (డీఎస్‌ఈ)కు అందజేయాలన్నారు. ఈ నిబంధనలను పాటించకపోతే శాఖాపరంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తు లను వెల్లడించాలంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 1998 ఫిబ్రవరి 4న జీవో నంబర్ 52ను పెద్దగా అమలు చేయలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆస్తుల వెల్లడి జీవో అమలుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ రిటర్న్ పాన్ నంబరుతో సహా నిర్ణీత ఫార్మాట్‌లో పొం దుపరుచాలి. అందులో ఎలాంటి తప్పుడు సమాచా రమున్నా చర్యలు తీసుకోవచ్చని డిక్లరేషన్ ఇవ్వాలి.
విద్యాశాఖ ఉద్యోగులు ఆస్తులను వెల్లడించాలి!
Published Sun, Dec 18 2016 4:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
Advertisement