ప్రొఫెసర్ డేవిడ్‌కు పదోన్నతి ఉత్తర్వులు అందజేస్తున్న రిజిస్ట్రార్ వెంకట్రామ్‌రెడ్డి
కేయూ క్యాంపస్: ఈ నెల 31న ఉద్యోగ విరమణ ఉండగా 30వ తేదీన ప్రమోషన్ ఇచ్చారు కాకతీయ వర్సిటీ అధికారులు. యూనివర్సిటీలో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ విభాగాల ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని అకుట్ బాధ్యులు విన్నవించినా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్లు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేశారు.
జియాలజీ ప్రొఫెసర్ కె.డేవిడ్ కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎట్టకేలకు వర్సిటీ అధికారులు సోమవారం సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ను పిలిపించి ఇంటర్వ్యూ నిర్వహించి సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు. వీసీ తాటికొండ రమేశ్, పాలక మండలిసభ్యుల సమక్షంలో రిజిస్ట్రార్ వెంకట్రామ్‌రెడ్డి సోమవారం సాయంత్రం డేవిడ్‌కు పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. రమేశ్ వీసీగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం గడిచినా, సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్స్‌లో జాప్యం చేసి ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు పదోన్నతి కల్పించడం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment