పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
నల్లగొండ టౌన్
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నల్లగొండ టౌన్
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీఓ నంబరు 342లోని ప్రి రెగ్యులేషన్ అనే మెమోను రద్దు చేసి జీఓ 2 లోనే అడక్వసీ అనే పదాన్ని తొలగించి గ్యాడర్ స్ట్రెంత్‌తో ప్రమేయం లేకుండా రిజర్వేషన్లను ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంట అంజయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు అద్దంకి దేవదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉబ్బల చినవెంకయ్య, కొచ్చర్ల వేణు, కోశాధికారి లచ్చిరాం నాయక్, రామకృష్ణ, సత్యం, సైదులు, నామ నాగయ్య, దుర్గయ్య, లింగయ్య, రాములు, దయాకర్, వెంకటయ్య, సైదానాయక్ పాల్గొన్నారు.