Why Prabhas Silent On Adipurush Movie? - Sakshi
Sakshi News home page

Adipurush Prabhas: సైలెంట్ మోడ్‌లో ప్రభాస్.. కారణమేంటి?

Published Sun, Jun 18 2023 1:19 PM | Last Updated on Sun, Jun 18 2023 2:24 PM

Why Prabhas Silent On Adipurush Movie? - Sakshi

'ఆదిపురుష్' థియేటర్లలో రిలీజైంది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ‍్ముదులిపేస్తోంది. కొందరికి సినిమా నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. ఇది వాళ్లే చెప్పారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి ఎవరిని కదిపినా, ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' గురించి ఒకటే డిస్కషన్. ఇంత జరుగుతున్నా సరే హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. పూర్తి సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ ఏంటి విషయం?

గత కొన్నేళ్లలో సినిమాల విషయంలో విపరీతమైన మార్పులొచ్చాయి. స్టోరీ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు మూవీ టీమ్ సరికొత్తగా ఉండేలా చూసుకుంటోంది. రిలీజ్ దగ్గర పడుతుందంటే చాలు.. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, సోషల్ మీడియాలో ప‍్రమోషన్స్ తో హోరెత్తించేస్తుంటారు. హీరోలు ఇందులో కీ రోల్ ప్లే చేస్తారు. తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అక‍్కడా ఇక్కడా తిరుగుతూ తెగ కష్టపడతారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం ఇలా జరగలేదే అనే అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!)

ఎందుకంటే 'ఆదిపురుష్' కి తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ ప్రమోషన్స్ చేయలేదు. జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదిరిపోయే రేంజులో నిర్వహించారు. దీనికి రూ.2 కోట్లకు పైగానే ఖర్చయిందని టాక్. ఆరోజు వైట్ అండ్  వైట్ డ్రస్ లో సందడి చేసిన ప్రభాస్.. స్పీచ్ కూడా సింపుల్ గా తేల్చేశాడు. అదే రోజు ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేయగా, దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

'ఆదిపురుష్' గురించి ప్రభాస్ పెట్టిన లాస్ట్ పోస్ట్ అదే. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాస్.. రిలీజ్ ముందు గానీ తర్వాత గానీ ఎలాంటి పోస్ట్, కామెంట్స్ చేయలేదు. ఈ షూటింగ్స్, ప్రమోషన్స్ హడావుడి నుంచి కాస్త రిలీఫ్ తీసుకుని ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో 'సాహో' విడుదల టైంలోనూ ఇలానే చేశాడని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటన్నారు. ఏదేమైనా 'ఆదిపురుష్' విషయంలో ప్రభాస్ సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: మేము తీసింది రామాయణం కాదు. . ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement