ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే! | 'Startup Diary' Research Media Group | Sakshi
Sakshi News home page

ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే!

Published Sat, Nov 3 2018 12:36 AM | Last Updated on Sat, Nov 3 2018 12:36 AM

'Startup Diary' Research Media Group  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఏ ఉత్పత్తయినా లకి‡్ష్యంచిన కొనుగోలుదారులకు చేరాలంటే నాణ్యతతో పాటూ బ్రాండ్‌ ఇమేజ్‌ తప్పనిసరి! దీనికోసం సెలబ్రిటీల ఎంపిక, ప్రకటనలు, ప్రచారం... ఇవన్నీ పెద్ద టాస్కే. కానీ, విజయవాడకు చెందిన రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌ దీన్ని సులభతరం చేసింది.

సెలబ్రిటీల ఎంపిక కోసం సెలబ్రిటీ హబ్, ప్రకటనల కోసం న్యూవేవ్‌ అడ్వర్టయిజింగ్, ప్రొడక్షన్‌ హౌస్‌ సేవల కోసం రీసెర్చ్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్ల నిర్వహణ కోసం మ్యాజిక్‌ మంత్ర... ఇలా అన్ని సేవలనూ అందిస్తున్న రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌. మరిన్ని వివరాలు సంస్థ చైర్మన్‌ జే చైతన్య ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.

చిన్న ప్రకటనల సంస్థగా మా ప్రస్థానం మొదలైంది. ఇపుడు కార్పొరేట్‌ ఈవెంట్స్, సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌ స్థాయికి చేరాం. ప్రస్తుతం రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌లో సెలబ్రిటీ హబ్, మేజిక్‌ మంత్ర, న్యూవేవ్‌ అడ్వర్టయిజింగ్, రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, పింక్‌ పీఆర్‌ లైన్స్, కీ హైట్స్‌ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి.

ఇప్పటివరకు రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌కు 18 వేల మంది కార్పొరేట్స్‌ క్లయింట్లున్నారు. వీటిలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఉత్పత్తుల తయారీ కంపెనీల వరకూ అన్నీ ఉన్నాయి. త్వరలోనే కంటిన్యూ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీఎంఈ), కామినేని, కేర్‌ ఆసుపత్రులు, ప్రక్రియ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ మా క్లయింట్ల జాబితాలో చేరనున్నాయి.  

ఇదీ... మా కంపెనీల తీరు
సెలబ్రిటీ హబ్‌: 2014లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీనికి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, ముంబైలో బ్రాంచీలున్నాయి. సెలబ్రిటీల ఎంపిక కోసం ముంబైకి చెందిన సిమ్‌కామ్‌ మోడల్, చిరాక్‌ మేనేజ్‌మెంట్స్, జాకీ ఫెర్నాండెస్, పినాకిల్‌ రూడ్జ్, ది క్వీన్స్, ఎవాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం సెలబ్రిటీ హబ్‌లో 40 వేల మంది సినీ ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక వంటి దేశాల్లోని కార్యక్రమాలకూ తారలను అందించాం.  

మ్యాజిక్‌ మంత్ర: 2012లో ప్రారంభమైన ఈ సంస్థ కార్పొరేట్, వ్యక్తిగత ఈవెంట్లను నిర్వహిస్తుంది. గతేడాది రూ.40 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం.
న్యూవేవ్‌: విజువల్‌ యాడ్స్‌ రూపకల్పన కోసం న్యూవేవ్‌ అడ్వర్టయిజింగ్‌ పనిచేస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ కోసం అవసరమైన ప్రొడక్షన్‌ హౌస్‌ సేవల కోసం రీసెర్చ్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 టీవీ సీరియల్స్‌కు సేవలందించాం.

రూ.100 కోట్లు లక్ష్యం..
ప్రస్తుతం రీసెర్చ్‌ మీడియా గ్రూప్‌లో 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.60 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.100 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే సొంత బ్యానర్‌పై తెలుగు, హిందీ చిత్రాల నిర్మాణంతో పాటూ జాతీయ స్థాయిలో మిస్‌ ఇండియా పోటీలను నిర్వహించనున్నాం’’ అని చైతన్య వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement