పౌరసరఫరాల శాఖ అధికారులకు పోస్టింగులు | Promotion To Civil Supplies department officers | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల శాఖ అధికారులకు పోస్టింగులు

Published Tue, Oct 11 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 4:54 PM

పౌరసరఫరాల శాఖ అధికారులకు పోస్టింగులు

పౌరసరఫరాల శాఖ అధికారులకు పోస్టింగులు

సాక్షి, హైదరాబాద్: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల (డీసీఎస్‌వో)కు పోస్టింగులు ఖరారయ్యాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ శని, ఆదివారాల్లో ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేశారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్న నేపథ్యంలో 31 జిల్లాలకు అధికారుల పేర్లను ఖరారు చేశారు. ఖరారైన వారిలో ఎం.కె.రాథోడ్ (హైదరాబాద్), బి.ఎన్.వి.వి.కృష్ణప్రసాద్(నిజామాబాద్), ఎస్.ఉదయ్‌కుమార్(నల్లగొండ), ఎం.గౌరీశంకర్(రంగారెడ్డి/శంషాబాద్), డి.అనురాధ (సూర్యాపేట), పి.బి.సంధ్యారాణి (ఖమ్మం), ఎ.ఉషారాణి (కరీంనగర్), వి.నాగేశ్వర్‌రావు(మేడ్చల్), ఎస్.అమృతారెడ్డి (కొత్తగూడెం), పి.రాజారావు(జయశంకర్/భూపాలపల్లి), ఎ.వి.ఎస్.వి.ప్రసాద్‌రావు (సంగారెడ్డి), పి.సత్యనారాయణ(జగిత్యాల), వి.వెంకటేశ్వర్లు(సిద్దిపేట), ఐ.శారదాప్రియదర్శిని (మహబూబ్‌నగర్), ఎన్.విజయలక్ష్మి(వరంగల్ అర్బన్), ఎ.రమేశ్(కామారెడ్డి), జి.రేవతి (మెదక్), కె.అబీబ్ ఉర్ రహమాన్(పెద్దపల్లి), ఎ.లక్ష్మణ్ (మహబూబాబాద్), సి.హెచ్.తనూజ(వనపర్తి), సి.పద్మజ(వికారాబాద్), పి.సంధ్యారాణి (యాదాద్రి), జె.యుగంధర్ (మంచిర్యాల), వి.మోహన్‌బాబు (నాగర్‌కర్నూలు), ఎస్.విలియమ్స్ పీటర్(వరంగల్ రూరల్), ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి(గద్వాల), పి.రుక్మిణీదేవి(జనగామ), ఆర్.సుదర్శనమ్(నిర్మల్), సి.పద్మ(సిరిసిల్ల), ఎం.శ్రీకాంత్‌రెడ్డి(ఆదిలాబాద్), టి.సత్యనారాయణ(ఆసిఫాబాద్/కొమురం భీం) ఉన్నారు.

11 మంది అధికారుల డిప్యుటేషన్లు రద్దు...
వివిధ జిల్లాల్లో ఏఎస్‌వోలుగా పోస్టింగులు పొంది, అక్కడ పనిచేయకుండా హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫీసు, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్‌వో) కార్యాలయాల్లో కదలకుండా ఏళ్లకు ఏళ్లుగా తిష్ట వేసిన పౌరసరఫరాల శాఖ అధికారుల డిప్యుటేషన్లను కమిషనర్ సి.వి.ఆనంద్ రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు.

 వీరిలో చాలామంది వివిధ కారణాలను సాకుగా చూపెట్టి, తమకున్న రాజకీయ పరిచయాలను వాడుకుని డిప్యుటేషన్లపై హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పటిదాకా కమిషనర్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న పి.సంధ్యారాణి, వి.మాధవి, ఎ.స్వామి కుమార్, ఎ.వి.ఎస్.వి.ప్రసాద్‌రావు, షేక్ నసీరుద్దీన్, జి.బాలసరోజ, టి.అరవింద్‌రెడ్డిలను ఆయా జిల్లాలకు పంపించారు. అలాగే సీఆర్‌వో ఆఫీసులో పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు, బి.ఎన్.సరస్వతి, కె.శ్రీనివాస్, రంగారెడ్డి డీఎస్‌వో ఆఫీసులో పనిచేస్తున్న డి.దీప్తి డిప్యుటేషన్లను రద్దు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement