‘పర్సనల్‌’లో ప్రమోషన్లు లేనట్లేనా..! | Promotion Issue in Singareni Colories | Sakshi
Sakshi News home page

‘పర్సనల్‌’లో ప్రమోషన్లు లేనట్లేనా..!

Published Wed, Jun 26 2019 12:12 PM | Last Updated on Wed, Jun 26 2019 12:13 PM

Promotion Issue in Singareni Colories - Sakshi

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని పర్ససల్‌ విభాగం ప్రమోషన్లలో మైనింగ్‌ అధికారులు మోకాలడ్డుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణి సంస్థలో సుమారు 34 విభాగాల నిర్వహణలో కొనసాగుతుంది. ఈక్రమంలో మైనింగ్‌ విభాగం అధికారులు  పోకల్‌ పోస్టుల్లో అధికసంఖ్యలో ఉండగా, మిగతా సెక్యూరిటీ, ఎడ్యుకేషన్‌ వంటి పోస్టుల్లో మాత్రం కొంతకాలం గా పర్సనల్‌ విభాగంలో ఏజీఎం ర్యాంకు ఉన్నవారికి జీఎంగా ప్రమోషన్‌ కల్పించటం ఆనవాయితీ గా వస్తుంది. అయితే జీఎం ఎడ్యుకేషన్‌ పోస్టులో 2016 వరకు పర్సనల్‌ విభాగం అధికారులే జీఎం గా పనిచేశారు. 2016లో పర్సనల్‌ విభాగంలో ఏజీఎం ర్యాంకు వారు లేరనే సాకుతో ఆ పోస్టులో మైనింగ్‌ అధికారిని నియమించారు. ఈ సారి పర్సనల్‌ విభాగం అధికారులు ఏజీఎం ర్యాంకు లో ముగ్గురు, నలుగురు ఉన్నప్పటికి వారిని కాదని తిరిగి మైనింగ్‌ అధికారిని నియ మించటం పట్ల పర్సనల్‌ విభాగం అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సెక్యూ రిటీ జీఎంగా పర్సనల్‌ విభాగం అధికారి పనిచేస్తున్నారు.

ఈయన ఆగస్ట్‌ మాసంలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ ఉన్న ఒక్క పోస్టును కూడా మైనింగ్‌ వారికే కేటాయించాలని అధికారులు సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనివల్ల పర్సనల్‌ విభాగంలో 30 సం వత్సరాలకు పైగా పనిచేస్తున్న ఏజీఎంలు గాని, డీవైజీఎంలు గాని ప్రమోషన్లు రాక ఆ కేడర్‌ తోనే దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొందని పర్సనల్‌ విభాగం అధికారులు ఆరోపిస్తున్నారు. సింగరేణి లోని ప్రతి విభాగంలో ఫీల్డ్‌ వర్క్, ఎంక్వైరీ వర్క్, డ్రాప్టింగ్‌æవర్క్, సింగరేణి వ్యాప్త బదిలీలు, రిక్రూట్‌మెంట్‌ వంటి కీలక పనులు, కార్మిక సంక్షేమం వంటి పనులన్నీ పర్సనల్‌ విభాగం వారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వారు ఎం తటి సీనియర్‌ అయినా, జూనియర్‌ అయినా మైనింగ్‌ అధికారులతో పోల్చుకుంటే వారికి ప్రమోషన్లలో వెనుకబడి ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో వారికి ప్రమోషన్లు కూడా జాప్యం అవుతున్న నేపథ్యంలో యాజమాన్యం వారికి కేటాయించిన రెండు విభాగాల జీఎం పోస్టులకు కూడా మైనింగ్‌ అధికారులను నియమించాలనుకోవడం సరైన విధానం కాదని వాపోతున్నారు. 

పర్సనల్‌ విభాగంలో జీఎంకు ఎంత 
సీనియారిటీ ఉన్నా జీఎంగానే రిటైర్మెంట్‌..
 

సింగరేణిలో సీనియారిటీ ఉన్నవారిలో కొంత మందికైనా డైరెక్టర్లుగా ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. అది కూడా  కీలకమైన ఆపరేషన్స్, డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగాలు. కానీ పర్సనల్‌ విభాగంలో ఎంత సీనియారిటీ ఉన్నా జీఎంగానే రిటైర్మెట్‌ కావాల్సిందే. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్టర్‌ అయ్యే అవకాశం లేదు. సింగరేణి అపాయింట్‌మెంట్‌ అయిన నాటి నుంచి వారు నిత్యం కార్మికుల వెల్ఫేర్‌ కార్యక్రమాల్లో కీలకమైన పను లు చేయిస్తూ సంస్థ అభివృద్ధికి పరోక్షంగా సహా యాన్ని అందిస్తున్నారు. అలాంటి సమయంలో ఎక్కువ సీనియారిటీ ఉన్నవారికి పర్సనల్‌ డైరెక్టర్‌గా లేని పక్షంలో కనీసం డైరెక్టర్‌ పాగా నైనా ప్రమోషన్లు కల్పించాలని పలువురు పర్సనల్‌ విభాగం అధికారులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement