
తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి
♦ నిజామాబాద్ అడిషినల్ ఎస్పీగా నియామకం
♦ యేడాదిన్నర పాటు పనిచేసిన ఏఎస్పీ
♦ ట్రాఫిక్ నియంత్రణ, షీ టీములతో మహిళల భద్రతకు కృషి
తాండూరు: తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన చందనదీప్తిని నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ)గా నియమితులయ్యారు. తాండూరు ఏఎస్పీగా 2015 ఫిబ్రవరిలో ఆమె బాద్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ పనిచేశారు. ఆ సమయంలో తాండూరు పరిధిలో షీ టీం ద్వారా మహిళలకు భద్రత కల్పించారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేశారు. డివిజన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేశారు. రెండు రోజుల్లో ఆమె నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.