పదోన్నతి పొందిన వారిలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖా గోయల్
తిరిగి అదే స్థానాల్లో వారిని కొనసాగిస్తూ సీఎస్ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, బి.శివధర్‌రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్‌కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు.
డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్‌లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ సీపీగా, బి.శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ, అభిలాష బిస్త్‌ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్‌గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా, టీజీఎఫ్‌ఎస్‌ఎల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సర్వీస్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి సరీ్వస్ 2026 ఏప్రిల్ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్ 2027 డిసెంబర్ వరకు, శిఖాగోయల్ సర్వీస్ 2029 మార్చి వరకు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment