
బాలీవుడ్ సినిమా 'ఆత్రంగి రే'లోని ఫస్ట్‌సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ 'ఆత్రంగి రే' సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడి అక్కడి వారిలో మరింత జోష్‌ను నింపారు. నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్‌కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు.
మరో ప్రమోషన్ కార్యక్రమంలోనూ సారా అలీఖాన్ ఎంతో జోష్‌గా పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోరిక మీద పాట పాడుతూ స్టెప్పులతో అదరగొట్టారు. కాగా ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవ్‌గణ్ నటించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 'ఆత్రంగి రే' చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్‌స‍్టార్‌లో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment