'కేసీఆర్‌కు రైతులంటే గౌరవం లేదు'
Published Mon, Apr 10 2017 12:11 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
వరంగల్ అర్బన్: మిర్చీ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మిగనూరు మార్కెట్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు శ్రీధర్‌బాబు, గండ్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులంటే గౌరవం లేదు.. రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దారుణంగా పడిపోయాయి.
గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ ఏమి పట్టనట్లు కూర్చున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. క్వింటాకు రూ.12 వేలు ఇచ్చి మిర్చీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని’’ డిమాండ్ చేశారు. అంతకు ముందు మార్కెట్‌లో కలియ తిరిగిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Advertisement