రెండువారాల్లో భూ సర్వే అసాధ్యం | Earth Survey is impossible in two weeks | Sakshi
Sakshi News home page

రెండువారాల్లో భూ సర్వే అసాధ్యం

Published Thu, Aug 31 2017 3:05 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

రెండువారాల్లో భూ సర్వే అసాధ్యం - Sakshi

రెండువారాల్లో భూ సర్వే అసాధ్యం

బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌:
రెండువారాల్లో రాష్ట్రంలోని భూములను సర్వే చేయడం సాధ్యంకాదని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన తుగ్లక్‌ను మించిపోయిందన్నారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికీ రిజిస్ట్రార్లు లేరని, అలాగే ఏ ఒక్క శాఖకూ పూర్తిస్థాయి అధికారులు, సిబ్బందిలేరని అన్నారు.

ముఖ్యమంత్రి మూడేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూనే ఉన్నారని విమర్శించారు. భూములపై అవగాహన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూటకోమాట మాట్లాడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షాలను శత్రువుల్లా చూస్తూ, ఏకపక్షంగా వ్యవహరించడం మంచిదికాదని హెచ్చరించారు. సచివాలయానికి రాకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement