సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు తలపెట్టిన బంద్‌ను ప్రజలు తిరస్కరించారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీపై విశ్వాసంతో ప్రజలు దానిని విఫలం చేశారన్నారు. సోమవారం పార్టీ నాయకులు గోలి మధుసూదనరెడ్డి, సుధాకరశర్మ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుపై దుష్ర్పచారం చేస్తూ రెచ్చగొట్టేందుకు వివిధ ప్రతిపక్షపార్టీలు ప్రయత్నించినా ప్రజలు ప్రధాని మోదీకే మద్దతు తెలిపారన్నారు.
మోదీ నిర్ణయంతో నల్లధనం బయటకు రావడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మరిన్ని నిధులు అంది, అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగితే తమకు నూకలు చెల్లుతాయనే భయం ప్రతిపక్షాలకు పట్టుకుందన్నారు. నక్సలైట్ల డంప్‌లలో ఉన్న సుమారు రూ.60 వేల కోట్లు మురిగిపోరుునట్లేనన్నారు. ఈ విధంగా ఈ గ్రూపుల కార్యకలాపాలు కూడా తగ్గిపోరుు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.