హరీశ్ విమర్శల వెనుక కేసీఆర్: ఇంద్రసేన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మంత్రి హరీశ్‌రావు విమర్శల వెనుక సీఎం కేసీఆర్ ప్రమేయముందని బీజేపీనేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రం క్విం టాల్ మిర్చికి రూ.5వేల చొప్పున మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రకటించడం జోక్ అని, ఇది రైతులకు శఠగోపం పెట్ట డమేనని హరీశ్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర మంత్రిగా కేంద్రాన్ని విమర్శించదలుచుకుంటే, హరీశ్‌రావు సెక్రటేరియట్ నుంచి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఉండేవారన్నారు. టీఆర్‌ఎస్ కార్యాల యం నుంచి ఈ విమర్శలు చేయడమంటే కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని బద్‌నామ్ చేయడం తప్ప మరొకటి కాదని గురవారం ఆయన ఇక్కడ అన్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ కృషి వల్లనే రూ.5 వేల ధర వచ్చిందని టీఆర్‌ఎస్‌కు సంబంధించిన పత్రిక లో ప్రకటించి మరోవైపు దానిని తప్పుబట్టడంలో అర్థం లేదన్నారు.