మంత్రుల కార్యక్రమాల్లో నిరసనలు
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆయా సమ స్యలపై నిరసన తెలిపేందుకు ధర్నా చౌక్ లేనందువల్ల రాష్ట్ర మంత్రులు పాల్గొనే కార్యక్రమాల సందర్భంగా ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని నిర్ణయించినట్లు బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం తెలిపారు. కొన్నేళ్లుగా ప్రజా సమస్యలు, ఆయా అంశాల పై నిరసనలు తెలిపేందుకు ఉద్దేశించిన ధర్నాచౌక్‌ను ఎత్తేయాలని కేసీఆర్ నిర్ణయిం చిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తాన్ని ధర్నా చౌక్‌గా మార్చాలని పార్టీ నాయకులు, కార్య కర్తలకు, ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, మహిళా సంఘాల కు ఆయన విజ్ఞప్తి చేశారు. హామీలను నెరవే ర్చడంలో విఫలమైన సీఎం, వీటిపై నిరస నలను భరించలేక అణచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. మంగళ వారం పార్టీ నాయకులు జి.మనోహర్‌రెడ్డి, సుధాకరశర్మలతో కలసి ఆయన విలేకరుల తో మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపితే కేసీఆర్‌కు తన తప్పు తెలిసి వస్తుందని అన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి...
తమకు ఉప ఎన్నికలంటే భయం లేదని, గతంలో ఉప ఎన్నికల తోనే టీఆర్‌ఎస్ సత్తా చాటిందని చెబుతు న్న సీఎం కేసీఆర్ ఇతర పార్టీల్లోంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనా మా చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఇంద్రసేనారెడ్డి సవాల్ విసిరారు. మూడేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకాక ప్రజల్లో తీవ్ర అసం తృప్తి పెరుగుతోందని, దానిని కప్పిపుచ్చు కునేందుకే రెండు విడతలుగా సర్వే ఫలితాల ను విడుదల చేసి 106 సీట్లు గెలుస్తామంటూ పార్టీ నాయకులు కేడర్‌లో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నార న్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గ్రాఫ్ పతనం అవుతుం డడంతో దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు బీసీలు, ఎంబీ సీలకు వరాలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.