సీపీఎం కార్యాలయం ముందు ఉద్రిక్తత
న్యూ ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కేరళలో ఆపార్టీ విజయోత్సవ ర్యాలీలో బీజేపీకి ఓ కార్యకర్తను సీపీఎం కార్యకర్తలు హత్య చేయడానికి నిరసనగా వారు ఈ ఆందోళనకు దిగారు. ఆసమయంలో సీపీఎం పార్టీ ఆఫీసులో ఉన్న కార్యకర్తలు బయటికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.దీంతో ఆంధోళనకు చేస్తున్న 150 మంది కార్యకర్తలను అరెస్టు చేసి, సీపీఎం పార్టీ కార్యాలయం చుట్టూ పఠిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఎన్నికల ఫలితాల అనంతరం సీపీఎం విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీకి చెందిన ప్రమోద్(38) అనే కార్యకర్తపై ఇటుకతో దాడి చేసిన ఘటనలో అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.దీనిపై స్పందిచిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. సీపీఎం ఆదేశాలతోనే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రత్నామ్నాయ శక్తిగా ఎదుగుతున్నందుకే మాపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.