రేపటి నుంచి జగన్ ఉప ఎన్నికల ప్రచారం
♦ వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలో 19వ తేదీ వరకు పర్యటన
♦ రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న వైఎస్సార్‌సీపీ అధినేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం (ఈ నెల 16వ తేదీ) నుంచి వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్‌షోలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఉదయం వేళల్లో ఆయా ప్రాంతాల మీదుగా రోడ్‌షోలను నిర్వహించి, సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగి స్తారు. 16న ఉదయం 8 గంట లకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు.
జనగామ మీదుగా పాలకుర్తికి చేరుకుని.. దర్దేపల్లి, కొండాపురం, ఓగులాపూర్, జాఫర్‌గఢ్, దమ్మన్నపేట, వర్ధన్నపేట, డీసీ తండా, రాయపర్తి, మైలారం, వెలికట్ట, నాంజారిమడుగులలో రోడ్‌షోలను నిర్వహిస్తారు. తర్వాత తొర్రూరు బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రాయపర్తి, వర్ధన్నపేట, ఇల్లందు, పంతిని, మామునూరు మీదుగా రోడ్‌షోలను నిర్వహించి హన్మకొండకు చేరుకుంటారు. మంగళవారం (17వ తేదీన) హన్మకొండ నుంచి బయలుదేరి ములుగు రోడ్, గూడె ప్పాడ్, ఆత్మకూరు, తిరుమలగిరి, శాయంపేట, మైలా రం, జోగంపల్లి క్రాస్, కొప్పుల, చిన్నకొడెపాక, రేగొండ, ఘనపురం క్రాస్, చెల్పూరు, భూపాలపల్లి, రేగొండ, చెన్నాపూర్‌ల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. తర్వాత పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు.
తిరిగి హన్మకొండకు చేరుకుని బస చేస్తారు. బుధవారం (18వ తేదీన) రంగశాయిపేట, గుంటూరుపల్లి, కాపులకనపర్తి, గవిచర్ల, తీగరాజుపల్లి, తిమ్మాపురం, సంగెం, చింతలపల్లి, ఊకల్‌హవేలి, కోనాయిమాకుల, గీసుకొండ, ధర్మారం, గొర్రెకుంటల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. అనంతరం హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ప్రచారం చివరిరోజు గురువారం (19న) నయీంనగర్, కేఈ క్రాస్‌రోడ్, ఖాజీ పేట, మడికొండ, ధర్మసాగర్, ఎల్కుర్తి, పెద్దపెం డ్యాల, చిన్నపెండ్యాల మీదుగా రోడ్‌షోలు నిర్వహిం చి, స్టేషన్‌ఘన్‌పూర్ బహిరంగసభలో మాట్లాడుతారు. అక్కడి నుంచి కోమళ్ల, షాగల్, రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.