వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టే వరంగల్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టే వరంగల్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మార్పుల ప్రకారం బుధవారం జగన్ జితేందర్‌నగర్, లక్ష్మినగర్, మచిలిబజార్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్, గొర్రెకుంట క్రాస్, ధర్మారం, కోనాయిమాకుల, గీసుకొండ, చింతల్ ఫ్లైఓవర్, మిల్స్‌కాలనీ పీఎస్, శంభునిపేట, ఉర్సు దర్గా, కరీమాబాద్, శివనగర్, హెడ్‌పోస్టాఫీస్‌ల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు.
అక్కడి నుంచి వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్, ములుగురోడ్, హన్మకొండ చౌరస్తా మీదుగా సాయంత్రం హన్మకొండకు చేరుకుని హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. గురువారం (19న) మాత్రం అంతకుముందు ప్రకటించిన ప్రచార షెడ్యూల్‌కు అనుగుణంగానే హన్మకొండ నుంచి బయలుదేరి న యీంనగర్, కేయూ క్రాస్‌రోడ్, ఖాజీపేట, మడికొండ, ధర్మసాగర్, ఎల్కుర్తి, పెద్దపెండ్యాల, చిన్నపెండ్యాల మీదుగా రోడ్‌షోను నిర్వహిస్తారు. సాయంత్రం స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్, కోమళ్ల, షాగల్, రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు.