రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ముని కోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన
పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ప్రకటన
హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ముని కోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై సోనియా గాంధీ తనతో ఫోన్లో మాట్లాడారని రఘువీరా తెలిపారు. బాధిత కుటుం బాలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవ్వరూ క్షణికావేశాలకు లోనుకావొద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సోనియా గాంధీ చెప్పినట్లు ఆయన తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అందుకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.