
ఓట్ల పండగ
రాష్ట్ర మినీ శాసనసభ ఎన్నికలుగా అభివర్ణించే ృహత్ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల్లో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. ఇందుకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర విషయాలకు సంబంధించిన కసరత్తులను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలోనే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర హోం శాఖ ప్రణాళికలు రచిస్తోంది. సాక్షి, బెంగళూరు
ఇది కాంగ్రెస్ వ్యూహం
చాలా ఏళ్లుగా బెంగళూరు మేయర్ పదవికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందు కోసం ముఖ్యమంత్రితో పాటు బీబీఎంపీ పరి దిలోని మంత్రులే కాకుండా మిగిలిన నాయకులందరూ బెంగళూరులోనే మ కాం వేయనున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క నియోజకవర్గంలోని వార్డుల ను కేటాయించి ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా బ్లాక్ స్థాయి సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచారంతో పాటు ‘కానుకల పంపిణి’ వం టి విషయాలపై దృష్టి సారిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రోజుకు రెండు సార్లు నగర పర్యటన చేస్తానని ప్రకటించేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటి వరకూ ప్రభుత్వం చేపట్టిన సంక్షమ పథకాలపై విృ్త త ప్రచారం కల్పించనున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక విషయంలోకూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోంది. గత రెండేళ్లుగా ఆయా వార్డులో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్టు కేటాయించకూడదని నిర్ణయించింది.
తద్వారా ఆయా వా ర్డుల అభ్యర్థి ఎంపిక సమయంలో అసమ్మతిని చాలా వరకూ నివారించినట్లవుతుందని హస్తం అధినాయకుల ఆ లోచన. ఇలాంటి ఒకటి రెండు చోట్ల కాంగ్రెస్ ఓడిపోయినా ‘వ్యతిరేకులకు టికెట్టు కేటాయించకపోవడం’ మి గిలిన ప్రాంతాల్లోని కాంగ్రెస్ కార్యకర్త ల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్న భావన పెరిగి అంతిమంగా ఆ ఆ లోచన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపును చేకూరుస్తుందని ఆ పార్టీలోని నాయకులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 5లోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 6తేదీ నాటికి బీ-ఫాంలు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు.
మాజీ కార్పొరేటర్ భార్యలకు టికెట్టు లేదంటున్న బీజేపీ!
ఈసారి మొదటిసారిగా బీబీఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది తాజామాజీ కార్పొరేటర్లు ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో తాము ప్రాతినిథ్యం వహించిన స్థానాల్లో తమ భార్యలను పోటీలో నిలబెట్టి గెలిపించుకుని, తద్వారా తాము అనధికార కార్పొరేటర్లుగా చలామణి కావాలని చాలమంది నాయకులు భావిస్తున్నారు. అయితే భారతీయ జనాతా పార్టీ ఇందుకు చెక్ పెట్టాలని చూస్తోంది. తాజా మాజీ కార్పొరేటర్ల భార్యలకు ఈ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో పార్టీ పటిష్టతకు పాటుపడిన మహిళా కార్యకర్తలను గుర్తించి వారికి టికెట్టు ఇవ్వాలని భావిస్తోంది. దీనివల్ల మహిళా ఓటర్లను ఆకట్టుకుని ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు చేజెక్కించుకోవాలనేది కమలనాథుల ఆలోచన. ఇదిలా ఉండగా బీబీఎంపీ ఎన్నికల నిర్వహణ సమితిని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సమితిలో కేంద్రమంత్రులు అనంతకుమార్, డీ.వీ సదానందగౌడతో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్. అశోక్ భాగస్వాములుగా ఉంటూ, పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను ప్రధానంగా తమ భుజస్కంధాలపై వేసుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఉప సమితులకు సంబంధించి ప్రచార విభాగానికి బీ.ఎన్ విజయ్‌కుమార్, ప్రణాళిక రూపకల్పన విభాగానికి ఎస్. సురేష్‌కుమార్, మీడియా విభాగాన్ని అశ్వర్థనారాయణ పర్యవేక్షించనున్నారు.
బాండ్ పేపర్‌పై ‘రాజీనామా’ సంతకం చేయించనున్న జేడీఎస్?
అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వారు తప్పు చేశారన్న ఆరోపణలు వస్తే అలాంటి కార్పొరేటర్లను వెంటనే తొలగించడానికి వీలుగా జేడీఎస్ పార్టీ వినూత్న పంథాను అనుసరిస్తోంది. సాధారణంగా అభ్యర్థుల ఎంపిక సమయంలో అసమ్మతి చెలరేగి ఆ ప్రభావం అభ్యర్థుల గెలుపుపై చూపుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వీలుగా జేడీఎస్ పార్టీ బహిరంగంగా బీ-ఫాంలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందు కోసం ఈనెల 5న నగరంలోని నేషనల్ హై స్కూల్ మైదానంలో బహిరంగ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫాంలు ఇవ్వనుంది. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత అవకతవకలకు పాల్పడటం కాని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు మొగ్గుచూపినట్లు ఆరోపణలు వచ్చి ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ ృవీకరిస్తే పదవికి వెంటనే రాజీనామా చేస్తామని అదే సమావేశంలో అందరిముందు ప్రమాణం చేయించడమే కాకుండా బాండు పేపర్‌పై అభ్యర్థులతో సంతకాలు కూడా చేయించనుంది. దీని వల్ల జేడీఎస్ అభ్యర్థులను గెలిపిస్తే అక్రమాలకు ఆస్కారముండదంటూ ప్రచారంలో తెలియజెప్పవచ్చునని ఆ పార్టీ పెద్దల ఆలోచన. అంతేకాక కాలం కలిసొచ్చి మేయర్ ఎంపికకు జేడీఎస్ పార్టీ సహాయాన్ని ఇతర పార్టీ కోరే పక్షంలో ఆ సమయంలో కార్పొరేటర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దళపతులు ఈ నిబంధన విధించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.