
న్యూఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినన్ని జిమ్మిక్కులు ఎవరికీ తెలియవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని, ఏపీలో టీడీపీ పొలిటికల్ గేమ్ ఆడుతుందన్నారు. పొలిటికల్ గేమ్స్‌లో ఎవరూ కూడా చంద్రబాబును బీట్ చేయలేరని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాలను తమపై నెట్టాలని చూస్తున్నారని, కానీ తాము అలా జరగనివ్వమని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఇప్పటికే రాష్ట్రానికి చాలా సాయం చేశామని, భవిష్యత్తులోనూ మరింత చేస్తామని హామీ ఇచ్చారు. ‘వెన్నుపోటు రాజకీయాల్లో చంద్రబాబు సిద్ధహస్తులు. సొంతమామకు వెన్నుపోటు పొడిచారు. అధికారం పేరుతో చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు’ అని రాం మాధవ్ విమర్శించారు. అవిశ్వాస తీర్మానం గురించి తాము భయపడేది లేదని, తమకు పార్లమెంట్‌లో సరిపడ సభ్యులున్నారని చెప్పారు. టీడీపీ వైఖరి కేవలం రాజకీయమేనని, ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాన్ని అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడంపై, ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు. కాగ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీగా రామ్ మాధవ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం అమలుపై రాం మాధవ్ ఎక్కువగా దృష్టి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment