కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం--ఎంపీ గుత్తా | gutta sukhendar reddy slams Congress on Mallanna Sagar | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం--ఎంపీ గుత్తా

Published Mon, Jul 25 2016 8:13 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

gutta sukhendar reddy slams Congress  on Mallanna Sagar

తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా బేసిన్‌ల పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని హడావుడి చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండలో తన నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి, ఎంపీపీ పాశం రాంరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చని పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చేపడుతున్న రిజర్వాయర్లకు అడ్డుతగలడం సరియైన విధానం కాదన్నారు.

 

రిజర్వాయర్ల నిర్మాణాలను వ్యతిరేకించడమే గాక రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. పులిచింతల నిర్మాణంలో నల్లగొండ జిల్లాలో ఎకరం భూమి కూడా సాగులోకి రాకపోగా జిల్లా పరిధిలో 14 ఎకరాల భూమి కోల్పోవాల్సి వచ్చిందని, 14 గ్రామాలు ముంపునకు గురయ్యూయన్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కేవలం 16,500 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందన్నారు. ఈ రిజర్వాయర్ పూర్తరుుతే నల్లగొండ జిల్లాలో 2.63లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. అనవసర రా ద్ధాంతం చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ గుత్తా విజ్ఞఫ్తి చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement