
రూ.కోటిన్నర స్థలం ధారాదత్తం ?
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో కాంగ్రెస్ నాయకులకు భూ సంతర్పణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అసైన్‌మెంట్ కమిటీ ఆమోదం లేకనే కోటిన్నర విలువ చేసే ఇందిరమ్మ కాలనీ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నేతకు రెవెన్యూ అధికారులు అప్పగించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ స్థలాన్ని ఆ నాయకుడు లే-ఔట్లు వేసి విక్రయూనికి సిద్ధం చేశాడు.
పీలేరు, న్యూస్‌లైన్: పీలేరు శివార్లలోని దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కాలనీకి కేటారుుంచిన సర్వే నెంబర్ 1136/5లో రెండెకరాల స్థలంలో లే-ఔట్లు వేయడం వివాదాస్పదమైంది. ఇందిరమ్మ కాలనీ నిర్మాణం కోసం పీలేరు శివారు ప్రాంతం కోళ్లఫారంమిట్టన 2007లో 85 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం లే-ఔట్లు వేసిన స్థలం కాలనీ నిర్మాణం కోసం తీసుకున్నప్పటికీ, ఆరో విడత భూపంపిణీలో సర్వే నెంబర్ 1136/1పై రెండెకరాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతకు పట్టా ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ విలువైన భూమిని కాంగ్రెస్ నేతకు అధికారులు అప్పనంగా ఇచ్చేసారని విమర్శలు వస్తున్నారుు. నియోజకవర్గ అసైన్‌మెంట్ కమిటీ తీర్మానం లేకుండానే అధికారులు భూసంతర్పణ చేసినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే...
పీలేరు మండలంలో ఆరో విడత భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2012, ఆగస్టు 15న కలికిరి తహశీల్దార్ కార్యాలయంలో అసైన్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్హులైన 70 మందికి 129.21 ఎకరాల భూమిని పంపిణీ చేయూలని ఆమోదముద్ర వేశారు. దొడ్డిపల్లె పంచాయతీలో ఒక ఎస్సీ, నలుగురు బీసీలకు 10.61 ఎకరాలు, ఎంసీపాళెంలో ముగ్గురికి 5.92 ఎకరాలు, మేళ్లచెరువులో 41 మందికి 74.37 ఎకరాలు, ఎర్రగుంట్లపల్లెలో ఇద్దరికి 3.53 ఎకరాలు, అగ్రహారంలో ఇద్దరికి 3.84 ఎకరాలు, ముడుపులవేములలో నలుగురికి 5.71 ఎకరాలు, గూడరేవుపల్లెలో ఒకరికి 2.14 ఎకరాలు, జాండ్లలో ఒకరికి 2.66 ఎకరాలు, తలపులలో 8 మందికి 12.56 ఎకరాలు, రేగళ్లులో ముగ్గురికి 7.87 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని అసైన్‌మెంట్ కమి టీ ఆమోదముద్ర వేసింది.
అసైన్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందకనే ఈ జాబితాతో పాటు దొడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1136/5లో రెండెకరాల స్థలాన్ని ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఇవ్వడానికి అప్పటి మదనపల్లె సబ్ కలెక్టర్ సూచించనట్లు పేర్కొన్నారు. ఈ పేరు వద్ద తహశీల్దార్ సీలు లేకుండా కేవలం సంతకం మాత్రం ఉండడంతో పాటు, జాబితాలోని 70 పేర్లతో పోల్చితే చేతి రాత లోనూ తేడా ఉంది.
క్రయవిక్రయాలు చెల్లవు
స్థలాన్ని భూ పంపిణీలో ఇచ్చిన విషయం వాస్తవం. ఈ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. కొన్నా, అమ్మినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. లే-ఔట్లు వేసిన విషయం నా దృష్టికి కూడా వచ్చింది. వెంటనే వాటిని అడ్డుకుంటాం.
-ఎం.ఖాదర్‌షరీష్, తహశీల్దార్
అది నా స్థలమే..
కాలనీ నిర్మాణం కోసం నా వద్ద తీసుకున్న స్థలానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించ లేదు. దీంతో తిరిగి ఆ స్థలాన్ని ఆరో విడత భూపంపిణీలో అప్పటి మదనపల్లె సబ్ కలెక్టర్ హరికిరణ్ నాకే ఇచ్చారు. 1993లో ఎస్.అబ్దుల్లా వద్ద సర్వేనెంబరు 1136/1లో రెండెకరాల స్థలాన్ని కొన్నాను. 13 సంవత్సరాలు స్థలంలో వ్యవసాయం చేశాను. కాలనీ నిర్మాణం కో సం అందరి స్థలాలతోపాటు నా స్థలాన్ని తీసుకున్నా రు. నేను మాజీ సైనికుడిని కాబట్టి సబ్ కలెక్టర్‌కు నివేదించడంతో కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 1136/5లో రెండెకరాల స్థలానికి పట్టా ఇచ్చారు.
-లే ఔట్ యజమాని