
విజయోత్సాహం
- విద్యార్థుల నృత్యాలు
- వివిధ వర్గాల ర్యాలీలు
- కేసీఆర్, సోనియూ ఫ్లెక్సీలకు పాలాభిషేకం
వరంగల్, న్యూస్‌లైన్ : జై తెలంగాణ ...అమరవీరులకు జోహార్లు.. నినాదాలతో ఓరుగల్లు దద్దరిల్లింది. పల్లె, పట్నం విజయోత్సవ ర్యాలీలతో హోరెత్తాయి. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో జిల్లాలో రెండోరోజు బుధవారం కూడా తెలంగాణవాదులు సంబరాలు చేసుకున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, విద్యార్థి, యువజన, ఉద్యోగ, ప్రజాసంఘాలతో పాటు వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగారుు. కేసీఆర్, నియూగాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు, టీవీ కళాకారులు ర్యాలీ నిర్వహించారు.
ఆటాపాటలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నుంచి అంబేద్కర్, కాళోజీ సెంటర్ మీదుగా కాజీపేట వరకు భారీ మోటార్‌సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. సీకెంఎం కళాశాల విద్యార్ధులు పొచమ్మమైదాన్ వరకు ర్యాలీలు నిర్వహించారు. గాయత్రి కళాశాల నుంచి ములుగురోడ్డు వరకు విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. కేయూ క్రాస్ రోడ్డులో వివిధ కళాశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
కేయూ విద్యార్ధులు రాత్రి కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించారు. జనగామ, మహబూబాద్, నర్సంపేట, పరకాల్లో న్యాయవాదులు భారీ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, మహబూబాద్‌లలో ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సంగెంలో సోనియాగాంధీ ఫ్లెక్సీలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. వరంగల్ ఏవీవీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవాలు జరిపారు.
నర్సంపేటలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. రేగొండలో మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నర్సింహులపేటలో తెలంగాణా బిల్లును లోక్‌సభ ఆమోదించడం పట్ల ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగులు విజయోత్సవం నిర్వహించుకొని స్వీట్లు పంపిణీ చేశారు. వర్ధన్నపేట, లింగాల ఘనపురంలో తెలంగాణవాదులు, విద్యార్థులు తెలంగాణ సంబురాలు నిర్వహించుకున్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంబురాలు
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం నయీంనగర్‌లో స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, విద్యార్థి విభాగంఅధ్యక్షుడు కందుకూరి మహేందర్‌లు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్న బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వెఎస్సార్‌సీపీ కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు ఎండీ బద్రుద్దీన్‌ఖాన్, మహమ్మద్‌బేగ్, నాగరపు దయాకర్, రజనీకాంత్, పసుపులేటి కిరణ్, పల్లకొండ సురేష్, నమిండ్ల పరమేశ్వర్, సేవాదళ్ అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.