టేపులు నిజమైతే బాబు రాజీనామా చేయాల్సిందే
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ: ఓటుకు కోట్ల వ్యవహారంలో ఆడియో టేపులు నిజ మైతే బాబు తన పదవులకు రాజీ నామా చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రధానిని కలిశారు. మోదీ ఈ వ్యవహారంలో బాబును రక్షిస్తారని భావిస్తున్నారా?’ అనే ప్రశ్నకు.. ‘మోదీ ప్రభుత్వం 2002 గుజరాత్ అల్లర్లలోని నింది తులను కాపాడుతున్నట్లయితే.. ఇష్రత్ జహాన్ తదితరుల ఫేక్ ఎన్‌కౌంటర్లలో నిందితులను రక్షిస్తున్నట్లయితే.. ఇప్పుడు బాబును కూడా అదేరీతిలో గట్టెక్కిస్తారు.’ అని వ్యాఖ్యానించారు.