బస్సుయాత్ర ముగింపు సభలో నేతల హెచ్చరిక
హామీ నిలబెట్టుకోవాలి
తిరుపతి కల్చరల్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి తప్పదని నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరినాయుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాజారెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని గతనెల 27న ఆప్స్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, నాన్ పొలిటికల్ జేఏసీ, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభిం చిన విషయం విదితమే. శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర మంగళవారం తిరుపతికి చేరుకుంది.
ఎయిర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బస్సు యాత్ర ముగింపు సభలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ తెలుగు ప్రజల నోట్లో మట్టికొట్టిపోయారని విమర్శించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు 10 ఏళ్లు కావాలన్నారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని అన్నా రు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆప్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.రాజేంద్రప్రసాద్‌రెడ్డి, నవ్యాం ధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ఫ్రీ, జిల్లా కన్వీనర్ తేజ్‌ప్రకాష్, శ్రీనివాస్, కోటేశ్వరరావు, నాగేంద్ర, ఆదినారాయణ, కె.రమేష్, బాలాజి, గణేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
‘హోదా’ విస్మరిస్తే కాంగ్రెస్ గతే
Published Wed, Feb 3 2016 2:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement