స్వదేశానికి చేరుకున్న సోనియా
Published Fri, Mar 24 2017 5:21 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(70) అమెరికా నుంచి తిరిగి వచ్చారు. అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లిన సోనియా, కుమారుడు రాహుల్‌తో కలిసి గురువారం రాత్రి భారత్‌కు వచ్చారు. ఈ నెల మొదటివారంలో ఆమె రహస్యంగా అమెరికా వెళ్లిపోయారు. ఆమెతో పాటు ఉండేందుకు రాహుల్ గాంధీ ఈనెల 16వ తేదీన అమెరికా వెళ్లారు.
అనారోగ్య కారణాలతోనే ఈ నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ ప్రచారం చేయలేకపోయారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు త్వరలోనే సోనియా కొత్త నిర్ణయాలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement
Advertisement