
మనుగడ కోసమే కాంగ్రెస్ నేతల గగ్గోలు: కవిత
రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై గగ్గోలు పెడుతోం దని, దీనిపై రాద్ధాంతం
‘ప్రాణహిత’ రీడిజైన్‌పై రాద్ధాంతం తగదని వ్యాఖ్య
ఇబ్రహీంపట్నం: రాజకీయ మనుగడ కోసమే కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్పుపై గగ్గోలు పెడుతోం దని, దీనిపై రాద్ధాంతం అనవసరమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న జిల్లా నేతలెవ్వరూ ప్రాణహిత- చేవెళ్లపై నామమాత్రంగానైనా స్పందించలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు డిజైన్‌ను ప్రభుత్వం మార్చబోతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా వ్యవసాయాధారిత పంటలకు బదులు పాడి, చేపల పెంపకంపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు.