
కేసీఆర్ కాళ్లదగ్గర టీఆర్‌ఎస్ నేతల ఆత్మగౌరవం
సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి టీఆర్‌ఎస్ నేతలు పదవుల్లో కొనసాగుతున్నారని మాజీ మంత్రి ...
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి టీఆర్‌ఎస్ నేతలు పదవుల్లో కొనసాగుతున్నారని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొనగాల మహేశ్, బండారు శ్రీకాంత్‌రావులతో కలిసి గాంధీభవన్‌లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా టీఆర్‌ఎస్ వారెవరూ కేసీఆర్‌ను ప్రశ్నించడం లేదన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్రపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేయడాన్ని శ్రీధర్‌బాబు, గండ్ర ఖండించారు.