విడిపోయినందునే బాగు పడుతున్నాం..! | developed to Partitioning | Sakshi
Sakshi News home page

విడిపోయినందునే బాగు పడుతున్నాం..!

Published Mon, Jan 25 2016 1:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

విడిపోయినందునే బాగు పడుతున్నాం..! - Sakshi

విడిపోయినందునే బాగు పడుతున్నాం..!

మూసాపేట: విభజనతోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నాయని రాష్ట్ర ఐటీశాఖ మం త్రి కె.తారకరామారావు అన్నారు. ఆది వారం కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధి లో ఆయన రోడ్ షో నిర్వహించారు.  ఈ సందర్భంగా మూసాపేట చౌరస్తా, బా లాజీనగర్, మోతీనగర్, అల్లాపూర్, కేపీహెచ్‌బీ చివరి బస్టాప్, కూకట్‌పల్లి, బా లానగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ విభజనతోనే గన్నవరం ఎయిర్‌పోర్టు, అమరావ తి, ఓడరేవులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కలిసి ఉంటే మరో 25 ఏళ్లైనా గన్నవరానికి ఎయిర్‌పోర్టు వచ్చేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోక ముందు తెలంగాణలో కేసీఆర్ ఆంద్రోళ్లను వెళ్లగొడుతారంటూ ప్రచారం చేశారని, అలాం టి ఘటనలు ఎక్కడైనా జరిగాయా అని అడిగారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థులు తూము శ్రావణ్‌కుమార్, పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి, జూపల్లి సత్యనారాయ ణ, పండాలసతీష్‌గౌడ్, కాండూరి నరేం ద్రచారిలను అధిక మెజార్టీతో గెలిపించాలని, డివిజన్, నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement