బల్దియాపై టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం
►మేము ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయి
►ఒక్క అవకాశం ఇచ్చి చూడండి
►గ్రేటర్ ను సుందరీకరణగా తీర్చిదిద్దుతాం
►రాంనగర్, ముషీరాబాద్‌లలో
►కవిత ఎన్నికల ప్రచారం మహిళల నుంచి విశేష స్పందన
ముషీరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ 19నెలల పాలనపై ప్రజ లకు నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తమను గ్రేటర్ ఎన్నికల్లో గెలిపిస్తుందని నిజమాబాద్ ఎంపి.కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని, ఇప్పుడు ప్రజల్లోకి వెళుతుంటే వారే సంక్షేమ కార్యక్రమాలను గురించి మాకు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ఆమె ఆనందాన్ని వెలిబుచ్చారు. శుక్రవారం రాంనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి వి.శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఆమె గొల్కోండ క్రాస్‌రోడ్స్ వద్ద ప్రారంభించారు. ప్రచార వేదిక వద్దకు కవిత చేరుకోగానే మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి హారతులు ఇచ్చి, శాలువాలతో సత్కరించారు. అనంతరం గోల్కొండ క్రాస్‌రోడ్ వద్ద నుండి రిసాలగడ్డ వరకు ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. రిసాల గడ్డ వద్దకు రాగానే మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు.
అన్నాచెల్లెళ్లు సుమయ్, యాసర్‌లు కవిత ప్రచారం వాహనం పైకి ఎక్కి మెడలో పూలు వేసి, తమ ఓటు కారు గుర్తుకే ప్రకటించారు. రిసాలగడ్డ జమిస్తాన్‌పూర్‌లోని బస్తీలో లంబాడిలు(బంజారాలు)లతో కలసి ఆమె నృత్యం చేసి అలరించారు. ప్రతి మైనార్టీ మహిళతో ఆమె చిరునవ్వులతో పలకరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజానికానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. అవి పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేం దుకు చర్యలు కూడా తీసుకున్నారన్నారు. కేవలం 19నెలల్లో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ చేశారన్నారు. ఆ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి చేరినందునే నేడు మా ప్రచారానికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు వరకు మేయ ర్ పీఠాన్ని అన్ని పార్టీలకు ఇచ్చారు. ఒకే ఒక్క సారి తమ పార్టీకి ఇచ్చి చూడండి, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారావు ప్రతాప్, డివిజన్ అధ్యక్షులు రేషం మల్లేష్, ఎజాజ్ హుస్సేన్, గజ్జల సూర్యనారాయణ, సిరిగిరి శ్యామ్, గజపతిరాజు, సువర్ణ, సంపూర్ణనంద, ఎల్జెబెత్, పెంటారెడ్డి,
ముషీరాబాద్ డివిజన్‌లో...
ముషీరాబాద్ డివిజన్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్‌తో కలసి ఎంపి కవిత డివిజన్‌లోని రామాలయం, ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీ, వైఎస్సార్ పార్క్, గణేష్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలతో ప్రత్యేకంగా పలకించారు. ఓ పసిపాపను ఎత్తుకుని ముద్దాడి అందరినీ అలరించారు. ఎడ్ల హరిబాబు యాదవ్, వరుణ్‌యాదవ్, బిక్షపతి, భరత్‌నగర్ రాజు, గోపాలరావు, బి.ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.