
ఓటెత్తిన సెలబ్రిటీ
ఓటు హక్కు ముఖ్యమైనది..
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ప్రధానమైనది. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విజయనిర్మలతో కలిసి నేను ఓటు వేశాను. ఏ ఎన్నికలు జరిగినా విధిగా ఓటు వేస్తా. ఇది నా బాధ్యతగా భావిస్తాను. మన నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునేందుకు ఓటేయాలి. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - సినీనటుడు, కృష్ణ
ఓటేసేవారికే ప్రశ్నించే హక్కు..
ఓటు వేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నేను భావిస్తా. దీని ద్వారా ప్రశ్నించే హక్కు వస్తుంది. జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశాను. గతంతో పోలిస్తే ఇప్పుడు ఓటింగ్‌పై అవగాహన బాగా పెరిగింది. హైదరాబాద్ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలన్నదే నా అభిమతం. లేటైనా పర్వాలేదు.. కానీ ఓటు వేయడం మాత్రం మరిచిపోవద్దు. ప్రాథమిక హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
- జూనియర్ ఎన్టీఆర్
ఇది అందరి బాధ్యత..
నాకున్న ఓటు హక్కును వినియోగించుకోవడం నా బాధ్యత. ఇది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం. నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశాను. అవగాహన ఉన్నవారు.. చదువుకున్నవారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. - సినీనటుడు నరేష్