ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై న్యాయ సందేహం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం పై సందేహం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసంతో పాటు ఓటు హక్కున్న ఎంపీలు కె.కేశవరావు, చిరంజీవి, జైరామ్మ్రేశ్, మహమ్మద్ అలీఖాన్‌లకు మేయర్ ఎన్నికలో ఓటు హక్కు కల్పించాలా, వద్దా అన్నది తేల్చుకోలేక ఉన్నధికారులు తల పట్టుకుంటున్నారు. దీనిపై న్యాయశాఖ కూడా ఎటూ తేల్చలేక.. ఏజీ సలహా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యమున్న 18మంది రాజ్యసభ సభ్యులను విభజన అనంతరం ఏపీ, తెలంగాణలకు డ్రా పద్ధతిలో కేటాయించారు.
అందులో తెలంగాణకు కేవీపీ రామచందర్‌రావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, జి.సుధారాణి, జి.మోహన్‌రావు, వీహెచ్ రాగా... ఏపీకి రేణుకాచౌదరి, సుబ్బరామిరెడ్డి, జేడీ శీలం, సుజనాచౌదరి, దేవేందర్‌గౌడ్, తోట సీతారామలక్ష్మి, కేకే, చిరంజీవి, జైరాంరమేశ్, అలీఖాన్ వచ్చారు. కేకే, చిరంజీవి, జైరాం రమేశ్, అలీఖాన్‌లకు హైదరాబాద్‌లో ఓటుహక్కుంది. దీంతో ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాపై గందరగోళం తలెత్తింది. ఏజీ సూచనల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
మేయర్ ఎన్నికలో ఆ ఎంపీలు ఓటేయవచ్చా?
Published Tue, Feb 2 2016 1:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM
Advertisement
Advertisement