
ఐదో రోజూ ఫాంహౌస్‌లోనే సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజులుగా తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు.
జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజులుగా తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు. శనివారం రాత్రి మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఫాంహౌస్‌లో ఉంటూ పంటలను పరిశీలిస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల సరళిపై ఆరా తీశారు.
అలాగే నారాయణఖేడ్ ఉప ఎన్నిక స్థితిగతులపై మంత్రి హరీశ్‌రావుతో ఫోన్‌లో మాట్లాడి సమాచారం సేకరించినట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్ వెళ్లేందుకు అంతా సిద్ధం కాగా, చివరి క్షణంలో విరమించుకున్నట్లు తెలిసింది. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ పంటలను పరిశీలించినట్లు సమాచారం.