
ఓటమి భయంతోనే మజ్లిస్ దాడులు: సీపీఐ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులపై ఎంఐఎం కార్యకర్తలు దాడులు చేసి హింసకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేశారని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులపై ఎంఐఎం కార్యకర్తలు దాడులు చేసి హింసకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేశారని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కౌన్సిల్ నేత షబ్బీర్ అలీని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నెట్టేయడం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి అరాచకాలకు పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. ఎంఐఎం దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.