MIM leaders
-
ఓల్డ్ సీటీలో ఎంఐఎం నేతలు అరెస్ట్
-
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై మజ్లిస్ ఆందోళన
-
దేశాన్ని..రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
చార్మినార్/దూద్‌బౌలి: ‘‘దేశాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి..ఇదే ప్రస్తుతం మన ముందున్న ప్రధాన కర్తవ్యం.. ఇళ్లకే పరిమితం కాకుండా రోడ్లపైకి రావాలి. మనం తెలిపే వ్యతిరేకతతో కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి’’అంటూ పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీ ఖిల్వత్ మైదానంలో ‘జస్నే జమూరియత్, ఎతాజాజీ ముషాయిరా’అనే పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ సభలో పలువురు కవులు, కళాకారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొని తమ వ్యతిరేకతను చాటి చెప్పారు. హైకోర్టు షరతులతో కూడిన అనుమతివ్వడంతో నిర్దేశిత సమయంలోనే సభను ముగించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవెసీ మాట్లాడకుండానే సభ ముగిసిం ది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అస్మా జాహేరా, ఇమారత్ మిలియా సరయా అధ్యక్షు డు జాఫర్ పాషా తదితరులతో పాటు సభలో ప్రముఖ కవులు మంజర్ బోపాలీ, రహాత్ ఇందోర్, హుస్సేనీ హైదరీ, అఫ్జల్ మంగ్లూరీ, ఇఖ్రాఖాన్ తదితరులు ఆలపించిన ముషాయిరాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హైకోర్టు షరతులతో కూడిన ఉత్తర్వుల మేరకు శనివారం రాత్రి సభ సకాలంలో ముగిసిందని గ్రేటర్ బీజేపీ ఉపాధ్యక్షుడు టి.ఉమామహేంద్ర అన్నారు. -
ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వివిధ డివిజన్లలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నేతలు, సంతోష్ నగర్లో సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పాతబస్తీని ఎంఐఎం తన సామ్రాజ్యంగా భావిస్తూ రౌడీయిజం చేస్తోందని మంగళవారం ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఓటమి భయంతోనే మజ్లిస్ దాడులు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులపై ఎంఐఎం కార్యకర్తలు దాడులు చేసి హింసకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేశారని మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కౌన్సిల్ నేత షబ్బీర్ అలీని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ నెట్టేయడం, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడం వంటి అరాచకాలకు పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. ఎంఐఎం దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
ఎంఐఎంతో టీఆర్ఎస్ మంతనాలు
తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు చైర్పర్సన్ సీటును దక్కించుకోవడానికి టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. చైర్పర్సన్ పదవికి కావాల్సిన 16 కౌన్సిలర్లకుగాను టీఆర్ఎస్కు పదిమంది కౌన్సిలర్లే ఉన్నారు. ఈ క్రమంలో ఎంఐఎం మద్దతు కూడగట్టుకొని చైర్పర్సన్ పదవిని దక్కించుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పది కౌన్సిలర్లను గెలుచుకున్న ఎంఐఎం నాయకులతో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఎంఐఎం పెద్దలతో మద్దతు కోసం చర్చలు కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలకు సమానంగా పది మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఈ రెండు పార్టీలు రెండున్నరేళ్లు చైర్పర్సన్ పదవిని పంచుకుంటాయా.. లేదా..? ఒక్క పార్టే పూర్తి స్థాయిలో ఐదేళ్లు చైర్పర్సన్ పదవిలో కొనసాగుతుందా? అన్నది తేలాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఎంఐఎంతో మద్దతు విషయమై టీఆర్ఎస్ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ వారంలోనే నిర్వహించేందుకు ఒక వైపు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నిక తేదీ ఖరారయ్యే లోపు చర్చలను ముగించి చైర్పర్సన్ వ్యవహారాన్ని క్లియర్ చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డి యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎంఐఎం మద్దతు కూడగట్టుకునేందుకు మంత్రి ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు చైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థుల మధ్య సమన్వయం కుదిర్చేందుకూ పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్లో కౌన్సిలర్లు కోట్రిక విజయలక్ష్మి, నర్కుల సింధూజ, నీరజ, శోభారాణి, పరిమళ, బిడ్కరి ఉషలు పోటీ పడుతున్నారు. రేసులో ఉన్న కౌన్సిలర్లందరూ తమ సామాజిక వర్గాల నేపథ్యంతోపాటు పార్టీలో సీనియారిటీ తదితర అంశాలను మంత్రికి వివరించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కొంత సంకట పరిస్థితి నెలకోవడంతో ఆయన ఆచితూచి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రేసులో ఉన్న కౌన్సిలర్లలో చైర్‌పర్సన్‌గా ఎవరికి అవకాశం ఇస్తే వ్యతిరేకత రాదోననే అంశాలపై పార్టీ శ్రేణులతోపాటు సన్నిహితుల ద్వారా ఆరా తీసున్నట్టు తెలుస్తోంది. ఆరు మందిలో ఒక్కరికే చైర్‌పర్సన్‌గా అవకాశం వస్తుంది. ఈ క్రమంలో మిగతా ఐదుమంది కౌన్సిలర్లు, వారి కుటుంబాలతో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రెండు మూడు రోజుల్లో చైర్పర్సన్ ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.