మజ్లిస్‌లో తగ్గిన ముస్లిమేతరులు
{పధాన పక్షాల్లో ముస్లింలకు కనిపించని ప్రాధాన్యం
అధికార పార్టీలోనూ అంతే
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘జై భీమ్.. జై మీమ్’ అనే నినాదంలో బరిలో దిగిన ఆల్ ఇండియా -మజ్లిస్ -ఎ -ఇత్తేహదుల్- ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీలో ముస్లిమేతర అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2009 ఎన్నికల్లో సుమారు 20 మంది ముస్లిమేతర అభ్యర్థులను రంగంలో దించిన మజ్లిస్ పార్టీ ఈసారి ఆ సంఖ్యను సగానికి కుదించింది. గతంలో మొత్తం 70 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపిన పార్టీ... ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం 60 డివిజన్లకే పరిమితమైంది. ముస్లింలు, బడుగు, బలహీన, దళిత వర్గాలు ఏకమైతే అధికారం హస్తగతం అవుతుందని బహిరంగ సభల్లో పార్టీ అధినేత అసదుద్దీన్ పదే పదే చేసే వాఖ్యలకు.. ప్రస్తుత జీెహ చ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీకి నిలిపిన అభ్యర్థుల సామాజిక వర్గాల సంఖ్యకు పొంతన లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధాన పక్షాల్లో చోటేదీ?
ప్రధాన రాజకీయ పార్టీల్లో ముస్లిం అభ్యర్థులకు ప్రాధాన్యం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 శాతం పైగా డివిజన్లలో ముస్లింల ప్రాబల్యం ఉంది. ఈ దామాషా ప్రకారం కూడా వారికి సీట్లు లభించలేదు. ముస్లింల పక్షపాతిగా చెప్పుకునే అధికార టీఆర్‌ఎస్ పార్టీ మొత్తం సీట్లలో 15 శాతమే వారికి కేటాయించింది. మొత్తం 150 డివిజన్లలో పోటీకి దిగగా... కేవలం 23 స్థానాలనే ముస్లింలకు కేటాయించింది. సెక్యుల ర్ పార్టీగా ప్రకటించుకునే కాంగ్రెస్ పార్టీ మొత్తం 149 స్థానా ల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. అందులో 28 స్థానాల్లోనే ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. ఇక తెలుగుదేశం-బీజేపీ కూటమి కూడా ముస్లింలకు ప్రాధాన్యమీయలేదు. తెలుగుదేశం 14, బీజేపీ 5 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. వామపక్షాలలో సీపీఎం పోటీ చేసిన 22 డివి జన్ల కు గాను మూడు చోట్ల, సీపీఐ 21 డివిజన్లకు గాను 5 చోట్ల ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దించింది. బీఎస్‌పీ 55 డివిజన్లకు గాను ఆరు, బీఎస్‌పీ 55కు ఆరు, లోక్‌సత్తా 26 స్థానాలకు ఒక చోట ముస్లిం అభ్యర్థిని పోటీలో నిలిపాయి.
బరిలో 241 మంది...
జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు గాను వివిధ పార్టీల తరఫున 1,333 మంది అభ్యర్థులు తలపడుతుండగా... అందులో ముస్లిం అభ్యర్థులు 241 మంది ఉన్నారు. ప్రధాన రాజకీయ పక్షాల తరఫున 162 మంది, స్వతంత్ర అభ్యర్థులుగా 79 మంది బరిలో ఉన్నారు.
మజ్లిస్‌లో ఇతరులకు కనిపించని ప్రాముఖ్యం
ముస్లింల పక్షాన గళం విప్పే మజ్లిస్ పార్టీ మొత్తం 60 స్థానాలలోనే పోటీకి పరిమితమైంది. వీటిలో ముస్లిం అభ్యర్థుల ను 50 డివిజన్లలో, ఇతరులను10 స్థానాల్లో బరిలో దింపింది. ఎంబీటీ 20 స్థానాల్లో పోటీ చేస్తుం డగా... 15 డివి జన్ల లో ముస్లింలను రంగంలోకి దిం చింది. ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 12 డివిజన్లలో ముస్లిం అభ్యర్థులను పోటీలో నిలిపాయి.