
రంగంలోకి తోటి కోడళ్లు
ఇద్దరు రాజకీయ దిగ్గజాలే. పరిస్థితుల నేపథ్యంలో పార్టీలు మారారు. ఇక రిజర్వేషన్ల ప్రక్రియలో తామనుకున్న డివిజన్‌లను మహిళలకు
ఇద్దరు రాజకీయ దిగ్గజాలే. పరిస్థితుల నేపథ్యంలో పార్టీలు మారారు. ఇక రిజర్వేషన్ల ప్రక్రియలో తామనుకున్న డివిజన్‌లను మహిళలకు కేటాయించడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు సతీమణులను నిలిపేందుకు సిద్ధమయ్యారు. తోటి కోడళ్లల్లో గెలుపెవరిదన్నదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ నేత కె.ఎం ప్రతాప్ సతీమణి కేపీ పద్మ టికెట్ ఆశిస్తుండగా, కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి ప్రతాప్ సోదరుడు, మాజీ కార్పొరేటర్ కె.ఎం గౌరీస్ భార్య కేజీ పారిజాతను నిలిపేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే టీఆర్‌ఎస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి టికెట్ ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. స్వయానా ఇద్దరు తోటి కోడళ్లు వేర్వేరు డివిజన్లలో రంగంలో ఉండడంతో ఇక్కడ పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- కుత్బుల్లాపూర్