ఎన్నికల నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు
► వడివడిగా ఎన్నికల నిర్వహణకు చురుగ్గా సన్నాహాలు
► కౌంటింగ్‌కు ఏర్పాట్లు
► జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. దీని కోసం అధికారులు వడివడిగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల కల్పన.. అవసరమైన సిబ్బందిని నియమించడం వంటివి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ పూర్తయ్యాక కౌంటింగ్‌కు అవసరమైన కేంద్రా లు.. టేబుళ్ల ఏర్పాటు.. సిబ్బంది నియామకంలోనూ మునిగారు. ఈవీఎంలలో పొందు పరిచేందుకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. వీటి ప్రింటింగ్ పూర్తయిందని... గురువారం ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ సురేంద్ర మోహన్ (ఎన్నికలు)తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో అదనపు కమిషనర్ (రె వెన్యూ) శంకరయ్య, సీసీపీ ఎస్.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలివీ...
24 కేంద్రాలు.. 893 టేబుళ్లు
ఫిబ్రవరి 2న పోలింగ్ జరుగనుంది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 4న నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం లెక్కింపుమొదలవుతుంది. దీనికి 24 కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్‌కు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 893 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు 3,200 మంది సిబ్బందిని నియమించారు.
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలె ట్లు పంపిణీ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలోనే దాదాపు 6,500 మంది రెగ్యులర్ ఉ ద్యోగులు ఉండగా... పోస్టల్ బ్యాలెట్లకు ఇప్పటి వరకు కేవలం 2,281 మంది మాత్రమేదరఖాస్తుచేసుకున్నారు. 2,677 మంది సర్వీస్ ఓటర్లకు పోస్టు ద్వారా బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఇబ్బందులు ఎదురవకుండా తాగునీరు, మరుగుదొడ్లు, ఎండ తగలకుండా టెం ట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, విద్యుత్ సౌకర్యాలు సమకూరుస్తున్నా రు. ఈ పనులు ఇప్పటి వరకు 70 శాతం పూర్తయ్యాయని... మిగతావి మరో రెండు మూడు రోజుల్లో పూర్తికానున్నట్లు కమిషనర్ చెప్పారు.
మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేస్తుండగా... 20 శాతం అదనంగా మొత్తం 9,352 పోలింగ్ పార్టీలను నియమించారు. (ఒక్కో పోలింగ్ పార్టీలో ఒక ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారు.)పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా డేగకళ్లతో నిఘా పెడుతున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రా ల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు రెప్పవాల్చని నిఘా కోసం 1,600 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి శిక్షణ ఇచ్చారు. వీరు లేని ప్రాంతాల్లో వెబ్ కెమెరాలను విని యోగిస్తారు. దీని కోసం 2,500 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణనిచ్చా రు. మెక్రో అబ్జర్వర్లలో కేంద్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకుల ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.
పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే 40,60,133 మందికి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు.ఇందులో 33.30 లక్షల మందికి తమ సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యక్తిగతంగా అందజే యగా... వెబ్‌సైట్ నుంచి 3,38,377 మంది, ప్రత్యేక యాప్ ద్వారా 92,047 మంది పోలింగ్ కేంద్రాల వివరాలను డౌన్‌లోడ్ చేసుకున్నారని కమిషనర్ తెలిపారు. మొత్తం ఓటర్లలో 55 శాతం మంది తమ పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. ‘సంకల్పం’ పేరిట తప్పకుండా ఓటేయాల్సిందిగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేశామన్నారు.
ఉల్లంఘనులపై చర్యలు
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు. ఇప్పటి వరకు 1,81,794 అనధికార కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు తొలగించామన్నారు. వాహనాల్లో తరలిస్తుండగా ఇంతవరకు రూ.2,08,28,200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రూ.1.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
1,059 మంది బైండోవర్
ఇప్పటి వరకు 1,059 మందిని పోలీసులు బైండోవర్ చేశారు. 2,318 లెసైన్సు కలిగిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 511 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.