కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు: పరిటాల సునీత | paritala sunitha GHMC election campaigning in hyderabad | Sakshi
Sakshi News home page

కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు: పరిటాల సునీత

Published Fri, Jan 29 2016 11:51 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు: పరిటాల సునీత - Sakshi

కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు: పరిటాల సునీత

హైదరాబాద్ : టీడీపీ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగిందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పరిటాల సునీత శుక్రవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


హైదరాబాద్ లో  తాము గెస్ట్లమని వ్యాఖ్యానించిన తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశాయని ఈ సందర్భంగా సునీత నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement