సిటీబ్యూరో: ‘స్థానిక సంస్థకు ప్రజాప్రతినిధుల ను ఎన్నుకునే కీలక సమయం వచ్చింది. సెల విచ్చారు కదా అని బద్ధకించకండి. మీ చేతిలోని వజ్రాయుధాన్ని వినియోగించండి’ అని చెబుతున్నారు ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ అధికారులు. స్వచ్ఛంద సంస్థ లూ ఇదే మాట చెబుతున్నాయి. గతంలో పోలింగ్ కేం ద్రం ఎక్కడో తెలియదనే బాధ ఉండేది. ఇప్పుడా దుస్థితి లేదు. వెబ్, మొబైల్ ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది. వాటి ద్వారా వివరాలు పొంది.. కాగితం మీద రాసుకొని వెళ్లినా సరిపోతుంది. అదీ కుదరకుంటే పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు వివరాలు తెలిపే సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంకెందుకు ఆలస్యం? కదలండి.
వెబ్‌సైట్ ద్వారా ఇలా ఓటరు స్లిప్ పొందవచ్చు
ఎపిక్ కార్డు లేని పక్షంలో సర్కిల్, వార్డులను సం బంధిత కాలమ్‌లలో భర్తీ చేశాక డోర్ నెంబరు, పే రు వివరాల్లో ఏ ఆప్షన్‌ను తీసుకున్నా సరిపోతుం ది. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు తెలిస్తే ఇంకా మంచిది.ఓటరు జాబితాలో కచ్చితంగా ఏపేరు ఉందో తెలిస్తే... ఆ ఆప్షన్‌పై టిక్ చేసి స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.లేని పక్షంలో పేరులోని తొలి అక్షరాలు కొన్ని నమోదు చేసినా వాటితో ప్రారంభమయ్యే ఓటర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో కావాల్సిన వారి పేరు, వివరాలు చూసుకోవాలి.ఎవరి ఓటరు స్లిప్ కావాలో ఆ పేరు వరుసలో ఉన్న ‘ప్రింట్ ఓటరు స్లిప్’పై క్లిక్ చేస్తే వార్డు నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు, లొకేషన్, ఓటరు జాబితాలో సీరియల్ నెంబర్, పేరు, తండ్రి/ భర్త పేరు, వయసు, లింగం, ఎపిక్ నెంబరు వివరాలతో స్లిప్ వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా సేవ్ చేసుకొని తర్వాత ప్రింట్ తీసుకోవచ్చు. వివరాలు రాసుకున్నా చాలు. పోలింగ్ కేంద్రంలో చెబితే త్వరితంగా ఓటు వేయవ చ్చు నగర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు ఈ స దుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి కోరారు.
యాప్ ద్వారా ఇలా..
ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ల ద్వారా దిగువ పేర్కొన్న విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి.సెర్చ్‌లో టీఎస్‌ఈ సీ ఓటర్ అని టైపు చేస్తే ‘టీఎస్ ఎలెక్షన్‌ఓటరు స్లిప్’ అనే యాప్ వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.యాప్‌ను ఓపెన్ చేస్తే ఎపిక్ / ఓటరు ఐడీ స్క్రీన్ వస్తుంది. దాన్లో ఎపిక్ నెంబరు ఎంట్రీ చేస్తే ఓటరు స్లిప్ వస్తుంది. ఈ వివరాలను సేవ్ చేసుకోవచ్చు.
ఓటేద్దాం..పదండి..!
Published Tue, Feb 2 2016 1:21 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement